తెలంగాణలో కొవిడ్ రెండోదశ తగ్గుముఖం పట్టడంతో జూపార్కులు, (ZOO PARKS OPEN) ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతించాలని సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆదివారం నుంచి నెహ్రూ జూపార్కులో సందర్శకులను అనుమతించనున్నారు. అయితే పులుల అభయారణ్యాలు పునరుత్పత్తి సీజన్ తర్వాతే పునఃప్రారంభం కానున్నాయి.
కొవిడ్ సెకండ్‌వేవ్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్లో భాగంగా మే 2నుంచి జూపార్కులను మూసివేశారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, కేబీఆర్ పార్కు, వరంగల్ కాకతీయ జూపార్కులను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు, రక్షిత అటవీ ప్రాంతాల్లో సందర్శకులను అనుమతించలేదు. కొవిడ్ తీవ్రత తగ్గడం, లాక్డౌన్ ఎత్తివేయటంతే జూపార్కులు, ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఇదీ చూడండి: kcr: 50 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం