చేతిలో డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్న వలస కూలీలకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. వలస కార్మికులను రైళ్లల్లో సొంత రాష్ట్రాలకు చేర్చడానికి అయ్యే ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వంమే భరిస్తుందని తెలిపారు. కార్మికుల శ్రమకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమిదేనని మంత్రి ట్విటర్‌లో వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన వలస కార్మికులను వారి వారి ఇళ్లకు క్షేమంగా పంపించడానికే సీఎం కేసీఆర్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయించారని చెప్పారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మే 29 వరకు లాక్డౌన్