ETV Bharat / state

ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి మే నెల సాయం విడుదల - బోధనేతర సిబ్బందికి ఆర్థిక సాయం

ప్రైవేట్​ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. మే నెలకు 2,04,743 మందికి రూ.40.94 కోట్లు బదిలీ చేసినట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తెరిచే వరకూ రూ. 2వేల సాయం, ఉచితబియ్యం అందించనున్నట్లు పేర్కొన్నారు.

telangana-government-financial-assistance-to-private-school-teaching-and-non-teaching-staff
ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సాయం
author img

By

Published : May 24, 2021, 3:08 PM IST

ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొని.. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ బోధన, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సాయాన్ని వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని... మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. మే నెలకు సంబంధించి 11 వేల 46 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 2,04,743 మంది సిబ్బందికి రూ.40.94 కోట్లు బ్యాంకు ఖాతాలకు ఇవాళ బదిలీ చేశారు.

ఇబ్బంది ఉన్నా..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో ప్రత్యేక ఛానళ్లు, యూట్యూబ్, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహించి, విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా చర్యలు చేపట్టడాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలు మళ్లీ తెరిచే వరకూ ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి నెలకు రెండు వేలు, 25 కిలోల రేషన్‌బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

ఏప్రిల్ నెలకు 1,25,587 మంది లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో సుమారు రూ.25 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 3,139 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించినట్లు వెల్లడించారు. మరికొందరికి విస్తరించాలని కోరడంతో సీఎం కేసీఆర్ అంగీకరించి... మరో 79,156 మందిని లబ్దిదారులుగా ప్రకటించినట్లు సబిత వివరించారు.

ఇదీ చూడండి: కరోనా వేళ.. నత్తనడకన టీకాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.