ETV Bharat / state

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది: ఉత్తమ్​

వరద సహాయక చర్యల్లో తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రెండు లక్షల కోట్లు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరానికి అయిదువేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు.

telangana government failed  in help to flood victims: uttam kumar reddy
వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది: ఉత్తమ్​
author img

By

Published : Nov 6, 2020, 9:22 PM IST

హైదరాబాద్​ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ‌కుమార్‌ రెడ్డి అన్నారు. వారిని ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రెండు లక్షల కోట్లు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరానికి అయిదువేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. భాగ్యనగర అభివృద్ధికి 67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారని.. ఆ మొత్తం దేనికి ఖర్చు చేశారో.. ఆ దేవుడికి తెలియాలన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఎంఎస్‌మక్తా ప్రజలు వర్షాలకు అన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు.

వరద బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రూ.550 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఈ నెల రెండో తేదీ నాటికి రూ.387 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించినా.. ఎవరెవరికి ఎంత ఇచ్చారో.. ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీశారు. కరోనా సమయంలో ఇచ్చిన రూ.1,500 మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరదబాధిత కుటుంబాలకు నగదు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. చెక్కుల రూపంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

అంత పెద్ద మొత్తంలో నగదు ఏలా డ్రా చేస్తారని.. గతంలో ఎన్నడూ నగదు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. తెరాస నాయకులకు మేలు చేసేందుకు అధికారులు నగదు రూపంలో పంపిణీ చేశారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలేది లేదన్నారు. ఎక్కడెక్కడ ఎంత మందికి వరద సాయం అందించారో...లెక్కలు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని.. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో అమెజాన్‌ పెట్టుబడులు పెట్టడంపై టీటా హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.