TS agreement with Bristol Myers pharma company: అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. వంద మిలియన్ డాలర్ల పెట్టుబడితో కంపెనీ స్థాపనకు ముందుకొచ్చిన ఈ సంస్థ ద్వారా 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
తయారీ రంగంలోనూ బ్రిస్టల్ మేయర్స్ దృష్టి సారించాలని కోరినట్లు కేటీఆర్ చెప్పారు. బయో ఆసియా ప్రారంభం అవుతున్న తరుణంలో ఇది ఒక మంచి పరిణామమని అన్నారు. ఈ మేరకు లైఫ్ సైన్సెస్‌లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని సవరించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అనుమతుల ఇబ్బంది హైదరాబాద్ ఫార్మా సిటీలో నేరుగా భూకేటాయింపులు చేస్తే వెంటనే కంపెనీ ప్రారంభించుకునే వెసులుబాటు లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
పరిశోధన, క్లినికల్ ట్రయల్స్‌పై దృష్టి పెడతామని మంత్రి చెప్పారు. రానున్న మూడేళ్లలో వంద మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ నగరమని.. డ్రగ్స్‌కు సంబంధించిన అన్ని రంగాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.
'హెల్త్ కేర్ , లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో ఎంతో నైపుణ్యం ఉందని బ్రిస్టల్ మేయర్స్ కంపెనీ ఎండీ సమ్మిత్ హిరావత్ అన్నారు. నాలుగైదేళ్లలో హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని, డ్రగ్స్‌కు సంబంధించిన అన్ని రంగాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
'తెలంగాణలోని జీవ ఔషధ రంగం ఎదైతే ఉందో, చాలా బలంగా ఎదుగుతా ఉంది. కాబట్టి బయో ఆసియా ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో జీవ ఔషధ రంగంలోని యువతకు చాలా మంచి వార్త. ఇప్పటిదాకా ఇండియాలో లేని ఒక కొత్త సంస్థ మన దగ్గరికి రావడం, అది కూడా హైదరాబాద్‌ను ఎంచుకోవడంతో చాలా ఆశాభావంతో ఉన్నాను. హైదరాబాద్ ఫార్మా సీటీ గురించి కూడా వారికి వివరించాను'. -కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
ఇవీ చదవండి: