Telangana fire department meeting postpone : సికింద్రాబాద్‌లోని దక్కెన్ షాపింగ్ మాల్ అగ్నిప్రమాద ఘటనపై ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. జీహెచ్ఎంసీ, ఫైర్ సెఫ్టీ, రెవెన్యూ, ఇతర అధికారుల జరగాల్సిన సమావేశం ఎల్లుండికి వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో వాణిజ్య భవణాలు, అనుమతులు, ఫైర్ అనుమతులు ఇతర అంశాలపై చర్చించేందుకు భేటీ అవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Deccan Mall Fire Accident Update : సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేటలోని దక్కన్‌మాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ ఇతర అధికారులతో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సమావేశం కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది.
సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేటలోని దక్కన్‌మాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ ఇతర అధికారులతో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సమావేశం కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది.
మరోవైపు అక్రమ నిర్మాణాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం వంటివి నగరంలో సుమారు 25వేల వరకు ఉండొచ్చని వెల్లడించారు. అయితే, అక్రమ కట్టడాలను రాత్రి రాత్రికి తొలగించలేమని.. వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ విభాగాలన్నీ వెంటనే స్పందించాయని, భవనంలో కెమికల్స్ ఉన్నందున మంటలు త్వరగా అదుపులోకి రాలేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భవనం నాణ్యతపై వరంగల్ నిట్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టూరిస్టులా వచ్చి మాట్లాడుతున్నారని తలసాని విమర్శించారు. డబ్బుల కోసం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తున్నారన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనాన్ని కూడా క్రమబద్ధీకరించలేదని, బీఆర్ఎస్పై హైకోర్టు స్టే ఉందన్న విషయం కిషన్‌రెడ్డికి తెలీదా? అని తలసాని ప్రశ్నించారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా చల్లారక ముందే నగరంలో మరో ప్రమాదం జరిగింది. బాలానగర్ P.S పరిధిలోని చింతల్ పద్మానగర్ ఫేజ్ -1 లోని స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న సెలూన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వ్యాపించడంతో భయందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోని తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.