ETV Bharat / state

ఎన్నికల వేళ ప్రచార రథాలకు భారీగా డిమాండ్ - Election Campaign Vehicles Being Prepared

Telangana Election Campaign Vehicles : ఎన్నికల్లో ప్రచార వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో.. ఇవి లేకుంటే పని ముందుకు సాగదు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార రథాలకు భారీగా డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో భాగంగా పలువురు నాయకులు హైదరాబాద్​లోని పలు చోట్ల ప్రచార వాహనాలను ఆధునిక హంగులతో తయారు చేయించుకుంటున్నారు.

Telangana Election Campaign Vehicles
Telangana Election Campaign Vehicles
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 2:12 PM IST

Telangana Election Campaign Vehicles : తెలంగాణలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఓ వైపు అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు ఖరారైన నాయకులు.. తమ అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. మరోవైపు ప్రచారానికి కావాల్సిన సామగ్రి, వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రచార రథాలను (Telangana Election Campaign Vehicles) ఆధునిక హంగులతో తయారు చేయించుకుంటున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసేందుకు, ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా.. ప్రచార రథాలను తమ అభిరుచికి తగినట్లు తయారు చేయించుకుంటున్నారు. పార్టీ గుర్తులు, ముఖ్య నేతల చిత్రాలతో పాటు అభ్యర్థి కూడా కనిపించే విధంగా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రచార రథాల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారింది. తద్వారా కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

దోమలగూడలోని చిన్న ఆర్ట్ సంస్థ ఈ ప్రచార రథాలకు పేరుగాంచింది. నాడు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార వాహనాన్ని.. సంస్థ యజమాని చందర్‌రావు అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో వందలాది ప్రచార రథాలను.. పార్టీల అభీష్టానికి అనుగుణంగా తయారు చేస్తున్నారు. తద్వారా నేతల మన్ననలను పొందుతున్నారు.

"పార్టీల ప్రచార రథాలను తయారుచేస్తున్నాం. ప్రజల్లోకి వెళ్లే విధంగా వీటిని రూపొందిస్తున్నాం. ఎన్నికల ప్రచార రథాలే కాకుండా.. ఇతర భకి కార్యక్రమాలకు సంబంధించి తయారుచేస్తాం." - చందర్‌రావు, చిన్న ఆర్ట్ సంస్థ యజమాని

పల్లెబాట పట్టిన పార్టీలు - అధికారం దక్కాలంటే ఆమాత్రం తిప్పలు తప్పవు మరి

Telangana Assembly Elections 2023 : దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో తాత్కాలికంగా, అరవింద్ కాలనీలోని తన నివాసం వద్ద వీటిని తయారు చేస్తున్నట్లు.. సంస్థ యజమాని చందర్‌రావు తెలిపారు. ఎన్నికల ప్రచార రథాలే కాకుండా.. ఇతర భక్తి కార్యక్రమాల రథాలను కూడా తయారు చేస్తామని చెప్పారు. ఇప్పుడు తన వద్ద 100 మంది వరకు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే సంస్థలో సుదీర్ఘకాలంగా దత్తాత్రి అనే కళాకారుడు అత్యంత ఆకర్షణీయైన డిజైన్స్‌తో ఆయా రథాలకు కొత్తదనాన్ని తీసుకువస్తున్నారు.

"కళాకారుడిగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అభ్యర్థుల అభిరుచికి అనుగుణంగా.. వారు కోరిన విధంగా ప్రచార రథాలను తయారు చేస్తున్నాం. ఆకర్షణీయమైన డిజైన్స్‌తో ప్రజలను ఆకట్టుకునే విధంగా వీటిని రూపొందిస్తున్నాం. మాకు కొంతమేర ఉపాధి దొరుకుతుంది." - దత్తాత్రి, కళాకారుడు

Telangana Political Parties Election Campaign : ప్రధాన ప్రాంతాల్లో తమ ప్రచార రథాలు కనబడేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకుంటున్నారు. తద్వారా ఓటర్లను ఆకర్షించడానికి ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు వీలు కాకపోవడంతో.. వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా ప్రచార రథాలకు డిమాండ్ అధికంగా ఉంది.

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ - ఇంకా తెగని కాంగ్రెస్ అభ్యర్థుల పంచాయితీ

ప్రలోభాలపై ఈసీ ప్రత్యేక నజర్ - గతానుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.