ETV Bharat / state

Telangana Election Campaign in WhatsApp : వాట్సాప్‌ గ్రూపుల్లో ఎన్నికల ప్రచారం.. స్పేస్‌ అంతా లాగేస్తోందని వాపోతున్న యూజర్స్ - Telangana Election Campaign in WhatsApp

Telangana Election Campaign in WhatsApp : తెలంగాణలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కానీ వారు కూడా ట్రెండ్​కు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఆధునిక ప్రచారానికి నాయకులు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియాపై ఫోకస్ చేశారు. వాట్సాప్‌లో గ్రూపులు ఏర్పాటు చేసి పోస్ట్‌లు చేస్తున్నారు. ఫలితంగా ఆ గ్రూప్‌ల్లో ఉన్న సభ్యులు.. ఆ వచ్చే మేసెజ్‌లతో నిండిపోతోందని వాపోతున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 12:08 PM IST

Telangana Election Campaign in WhatsApp : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఓవైపు టికెట్‌ దక్కించుకున్న నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ.. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలతో ( Election Campaign).. ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు.

Election Campaign Vehicles Being Prepared : ఊపందుకున్న ఎన్నికల ప్రచార పర్వం.. సిద్ధమవుతున్న రథాలు

ఎలక్షన్స్ అంటే అభ్యర్థులు, వారి అనుచరులు.. జనాలను వ్యక్తిగతంగా కలవడం, వారికి కరపత్రాలను అందివ్వడం పరిపాటే అని చెప్పవచ్చు. కానీ రోజురోజుకు ఎన్నికల ప్రచార సరళి పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు.. భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లతో.. నేతలు, కార్యకర్తలు హడావుడి చేసేవారు. ఇంటింటికి తిరుగుతూ.. తమకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకునేవారు.

How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు

Telangana Election Campaign in Social Media : కానీ ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ మారింది. అందరికీ అందుబాటులో ఉండే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియాల ద్వారా (Election Campaign in Social Media).. నేతలు ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. తద్వారా ఓటర్లు కొంత ఒత్తిడికి గురవుతున్నారు. సెల్‌ఫోన్లో వాట్సాప్‌ పోస్టులు కుప్పలుగా వచ్చి పడుతుండటమే ఇందుకు కారణమని ఓటర్లు అంటున్నారు. ప్రతి పార్టీ తమ సానుభూతిపరులు, తటస్థ ఓటర్లతో కలిపి బూత్‌స్థాయిలో వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేశాయి.

ఈ క్రమంలోనే పార్టీల అభిమానులు, వార్డు సభ్యులు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌లు ప్రారంభించారు. నేతలంతా స్థానికంగా తెలిసిన వారే కావడంతో వాటి నుంచి ఎగ్జిట్‌ అవ్వలేని పరిస్థితి వారిది. పార్టీల సామాజిక మాధ్యమాల బాధ్యులతోపాటు వీరంతా కలిసి రోజువారీ గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. మరోవైపు దీనికి అదనంగా పార్టీ రాష్ట్ర సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ రూపొందించిన కరపత్రాల చిత్రాలను జోడిస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : ఇవికాకుండా స్నేహితులు, కాలనీలు, సహోద్యోగుల గ్రూపులు ఉండనే ఉంటాయి. వాటిలోనూ రాజకీయ పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. తెల్లవారాక చూస్తే దాదాపు 500 వరకు మెసేజ్‌లు ఉంటున్నాయని పలువురు చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోలేక ఆటోమేటిక్‌ డౌన్‌లోడ్‌ ఆప్షన్లు మార్చుకుంటున్నామని అంటున్నారు. అయితే అత్యుత్సాహవంతులైన కార్యకర్తలు సార్‌, మా పోస్టులను మీరు చూడటం లేదు అని కూడా అడుగుతున్నారని పేర్కొంటున్నారు. దీంతో మెసేజ్‌లను ఓపెన్‌ చేసి, వెంటనే మూసేస్తున్నామని పలువురు వాపోతున్నారు.

EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

మరోవైపు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అభ్యర్థులు.. కుల, యువజన, మహిళా సంఘాల నేతలను ప్రసన్నం చేసుకోవడం, వారు అడిగింది చేయడం సర్వసాధారణం. కానీ టెక్నాలజీ విశ్వరూపం చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. అభ్యర్థులు ఈ సంప్రదాయ సంఘాలతో పాటు సరికొత్తగా సామాజిక మాధ్యమాలల్లోని గ్రూపులపైనా ఫోకస్ చేశారు. యూట్యూబ్‌, ఎక్స్(ట్విటర్), ఇన్​స్టాగ్రామ్, థ్రెడ్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్​బుక్, తదితర సోషల్ మీడియాల్లో ఎక్కవ మంది ఫాలోవర్లు, ఖాతాదారులున్న వ్యక్తులను, అడ్మిన్లను మచ్చిక చేసుకుంటున్నారు. తమ గురించి సానుకూలంగా.. ప్రత్యర్థులపై ప్రతికూలంగా ప్రచారం చేయడానికి ఈ గ్రూపులను అభ్యర్థులు వేదికగా ఎంచుకుంటున్నారు.

Political Heat in Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఊపందుకున్న ఎన్నికల జోరు.. పోటాపోటీగా ప్రచారం

Apps to Complain about Election Irregularities : ఈ యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకోండి.. ఎన్నికల్లో జరిగే అక్రమాలను అడ్డుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.