ETV Bharat / state

Good Governance Day in Decade Celebrations : నేడు రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనా దినోత్సవ కార్యక్రమాలు - రాష్ట్రంలో తీసుకువచ్చిన సంస్కరణలు ప్రభుత్వం ప్రకటన

Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు వివిధ శాఖలను పునర్‌ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని వారికి వివరించాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

Telangana Decade Celebrations
Telangana Decade Celebrations
author img

By

Published : Jun 10, 2023, 9:05 AM IST

Good Governance Day in Telangana : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సర్కార్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని.. రాష్ట్రంలోని పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా.. కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలని తెలిపింది.

Good Governance Day in Telangana Decade Celebrations : దీంతో పాటు ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.. అందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలని వెల్లడించింది. వీటి వల్ల ప్రజలకు దూర భారం తగ్గడమే కాకుండా.. పరిపాలనాపరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలని వివరించింది. వివిధ శాఖలను పునర్‌ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని వారికి వివరించాలని తెలిపింది.

  • special lighting at Govt Offices : విద్యుత్ వెలుగుల్లో ప్రభుత్వ కార్యాలయాలు

ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్‌ బీ, మిషన్ భగీరథ, హెల్త్, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలు పునర్ వ్యవస్థీకరించిన తీరుతెన్నులను.. తద్వారా ప్రజలకు చక్కని సేవలు అందుతున్న విధానాన్ని.. వీటి ప్రభావంతో ప్రజా జీవితంలో వచ్చిన మెరుగుదలపై నివేదిక తయారు చేయాలంది. రాష్ట్ర స్థాయిలోనూ సమావేశం నిర్వహించి, ఈ అంశాల గురించి వివరించాలని.. నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది.

మరోవైపు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు, ఇప్పటి వరకూ చేసిన పలు సంస్కరణలపై ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ సర్కార్ అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసిందని పేర్కొంది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టిందని వెల్లడించింది.

Telangana Decade Celebrations 2023 : ఈ క్రమంలోనే 2016 అక్టోబర్‌కు ముందు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవని తెలిపింది. ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉందని పేర్కొంది. దీనివల్ల పరిపాలన కష్టతరమయ్యేదని వివరించింది. దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని వెల్లడించింది. సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టం అయ్యేదని.. ఈ సమస్యలను అధిగమించటానికి తెలంగాణ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 33 వరకు పెంచిందని వివరించింది.

ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాలకు మేలు..: తద్వారా చిన్న పరిపాలనా విభాగాలతో సమర్థవంతమైన పాలన జరుగుతున్నదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రజలు గంట సేపట్లోనే తమ జిల్లాలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం కలిగిందని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణ అధికారులకు సులువైందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని కార్యక్రమాలను కూడా జిల్లా యూనిట్​గానే నిర్వహిస్తారని.. దీని వల్ల ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాలకు మేలు కలుగుతుందని గుర్తు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.