Telangana Formation Day Celebrations at Golconda fort : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరపనున్నారు. గోల్కొండ కోటలో భారత ప్రభుత్వం తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. గత రెండురోజులుగా గోల్కొండ కోటలో జరుగుతున్న... వేడుకల ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా.... ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
kishanreddy on Telangana Formation Day Celebrations : గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దిల్లీలో జరపగా... ఈసారి గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. నేడు చరిత్రాత్మక గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతోపాటు.. సాయుధ బలగాల పరేడ్ జరగనుంది. అనంతరం శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్‌ల బృందం, శ్రీమతి మంజులా రామస్వామి బృందం ప్రదర్శనలుంటాయి. తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా.... సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రముఖ గాయని మంగ్లీ, మధుప్రియల ఆధ్వర్యంలో... తెలంగాణ సంప్రదాయం, ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటల కార్యక్రమాలు పాఠశాల విద్యార్థుల కోసం... ఖిలాఔర్ కహానీ థీమ్‌తో పెయింటింగ్, ఫొటో పోటీలు ఏర్పాటుచేశారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ హాజరవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
- Kishanreddy Latest Comments : 'ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తాం'
- Telangana Formation Day celebrations 2023 : సర్వాంగ సుందరగా హైదరాబాద్.. విద్యుత్ దీపాలతో ధగధగ
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ పాత్ర తెలిపేలా ఫోటో ప్రదర్శనతోపాటు... మోదీ తొమ్మిదేళ్ళ పాలనకు సంబంధించి పోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఏ ఒక్కరి వల్లనో తెలంగాణ రాలేదు - సకల జనుల పోరాటంతోనే తెలంగాణ ఆవిర్భావం జరిగిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 1,200 ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిందన్నారు. తానే స్వయంగా కృష్ణా నది నుంచి గోదావరి వరకు 26 రోజుల పాటు తెలంగాణ పొరుయాత్ర చేశానని కిషన్ రెడ్డి తెలిపారు.
రాజ్‌భవన్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా తొలిసారి... అన్ని రాష్ట్రాల రాజ్ భవన్‌లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన వివరించారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపనున్నారు. రాష్ట్రఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 10 నుంచి 11వరకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గవర్నర్ డాక్టర్ తమిళిసై... ప్రజలు, పురప్రముఖులతో కలిసి వేడుకల్లో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి :