ETV Bharat / state

నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్న సీఎస్​ - telangana cs somesh kumar inspection in three districts

తెలంగాణలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో కామారెడ్డి వెళ్లి అక్కడి నుంచి సంగారెడ్డి, ఆ తర్వాత వికారాబాద్​ జిల్లాల్లో పనులను పరిశీలించనున్నారు.

telangana cs somesh kumar inspection in three districts
నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్న సీఎస్​
author img

By

Published : Jun 5, 2020, 8:06 AM IST

రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి తొలుత కామారెడ్డి పట్టణానికి చేరుకుంటారు. జిల్లాలోని రెండు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు.

కామారెడ్డి జిల్లాలో తనిఖీ పూర్తయిన అనంతరం సంగారెడ్డి జిల్లాకు, ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాకు వెళతారు. ఆయా జిల్లాల్లోనూ రెండేసి గ్రామాల్లో పనులు జరుగుతున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.