మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తోన్న 7,500 మంది ఉపాధి హామీ ఉద్యోగులను జీవో నెంబర్ 479 ద్వారా తొలిగించారని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు వారంతా నిరుద్యోగులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. వారిని ప్రభుత్వం తొలంగించడంతో గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద, బడుగు, బలహీన వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇకనైనా ఉపాధి హామీ ఉద్యోగులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుని.. పెడింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదంవండి: బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మహమూద్ అలీ