ETV Bharat / state

ఏపీ అంబులెన్సులకు నో ఎంట్రీ... రాష్ట్ర సరిహద్దులో ఆందోళనకర పరిస్థితి - ఏపీ అంబులెన్సులకు నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చికిత్స కోసం రాష్ట్రానికి వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల్లో పోలీసులు నిలిపేయడం... చర్చనీయాంశంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల పట్ల మానవత్వం లేకుండా ఎలా ఆపేస్తారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో తమకు పడక కేటాయించారని ప్రాధేయపడినా కొంతమందిని వెనక్కు పంపగా.. రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.

BORDER
BORDER
author img

By

Published : May 10, 2021, 8:47 PM IST

ఏపీ అంబులెన్సులకు నో ఎంట్రీ... రాష్ట్ర సరిహద్దులో ఆందోళనకర పరిస్థితి

ఏపీ నుంచి చికిత్స కోసం.. హైదరాబాద్‌ వెళ్తున్న కొవిడ్ రోగుల అంబులెన్సులను రాష్ట్ర పోలీసులు అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. అంబులెన్స్‌లను.. సరిహద్దుల వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు... కోవిడ్ రోగుల వాహనాలను వెనక్కి పంపుతున్నారు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు కొవిడ్‌ రోగులు వచ్చే అంబులెన్సులను వెనక్కి పంపారు. ఏపీ కొవిడ్ రోగులకు రాష్ట్రంలోకి అనుమతి లేదని చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్స్‌లను పుల్లూరు టోల్ గేట్ వద్ద.... తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్‌లో పడకలు, ఆక్సిజన్ లేవని చెప్పారు. కడప జిల్లా మైదుకూరు నుంచి హైదరాబాద్​ ఆసుపత్రికి ఓ బాధితుడ్ని తరలిస్తుండగా..... టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని... దాదాపు రెండు గంటలు బంధువులు బతిమాలినా... పోలీసులు పట్టించుకోలేదు. చేసేది లేక అంబులెన్స్‌లో వెనక్కు తీసుకెళ్లారు.‍

ఆవేదన.. ఆగ్రహం...

అనంతపురం నుంచి.. హైదరాబాద్ వస్తున్న కరోనా రోగి అంబులెన్స్‌ను నిలిపివేయడంపై ఓ రోగి భార్య తీవ్ర ఆవేదనతోపాటు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి విషమంగా ఉన్నా ఎందుకు అనుమతించడం లేదని... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు.

అనుమతి ఉంటేనే..

చివరకు ఉన్నతాధికారులతో మాట్లాడిన తెలంగాణ పోలీసులు... బాధితుడిని హైదరాబాద్ పంపించారు. కర్నూలు పోలీసులు పుల్లూరు టోల్​గేట్ వద్దకు చేరుకుని తెలంగాణ పోలీసులతో చర్చించారు. పడకలు ఖాళీ ఉన్నాయని.. హైదరాబాద్ లోని ఆస్పత్రులు హామీ ఇచ్చిన వారిని అనుమతించాలని కోరారు. ఫలితంగా... ఆయా అంబులెన్స్​లను మాత్రమే రాష్ట్రంలోకి రానిస్తున్నారు.

వాళ్లు రావొచ్చు..

తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పక తీసుకోవాలంటున్న పోలీసులు.. రోగికి పడక ఉందని ఆస్పత్రి అంగీకారపత్రం ఉండాలని..... స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం కర్నూలు-మహబూబ్‌నగర్‌ సరిహద్దుల్లో.. తనిఖీలు చేపట్టి....... వైద్య చికిత్స కోసం ఏపీకి వెళ్లి తిరిగి రాష్ట్రానికి వస్తున్న వారిని అనుమతిస్తున్నారు. ఆధార్‌ కార్డులు..... పరిశీలించాక తెలంగాణకు పంపిస్తున్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​పై రేపు సీఎం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.