Telangana Congress Lok Sabha Candidates 2024 : అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆశావహులు లోక్‌సభ స్థానాల్లో పోటీపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంతో అనుకూలంగా ఉన్న స్థానాల్లో పోటీ కూడా పెరిగింది. అయితే ఆదిలాబాద్, హైదరాబాద్, చేవేళ్ల లోక్‌సభ స్థానాల్లో పోటీ తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, మిగిలిన స్థానాల్లో బరిగిలో దిగేందుకు నేతలు పెద్దసంఖ్యలో సిద్ధమవుతున్నారు.
పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు, కరీంనగర్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన జీవన్‌రెడ్డి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి హరివర్ధన్‌రెడ్డిలు పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Telangana Congress Focus on Parliament Elections 2024 : సికింద్రాబాద్ నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్‌యాదవ్ , చేవెళ్ల నుంచి ఎన్ఆర్ఐ రాహుల్, రఘువీర్ రెడ్డిలు పోటీకోసం అభ్యర్థితత్వాన్ని పార్టీ ముందుంచాలని నిర్ణయించుకున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్గొండ నుంచి పటేల్ రమేశ్ రెడ్డి లేదా, జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, భువనగిరి నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది.
Lok Sabha Candidates in Telangana Congress : వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య లేదా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, నెహ్రూ నాయక్ పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిలు తమకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం
Parliament Elections 2024 : మరోవైపు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం బిజిబిజీగా గడుపుతున్నారు. ఇటు టీపీసీసీ చీఫ్‌గా, అటు రాష్ట్ర ముఖ్యమంత్రింగా వ్యవహరిస్తున్నారు. సీఎంగా అన్ని వ్యవహారాలను చూస్తూనే, పార్టీ కార్యక్రమాలను సైతం భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఈ తరుణంలో పూర్తిస్థాయిలో పీసీసీ నియామకంపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు 3 నేలలు మాత్రమే ఉండడంతో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. 17 స్థానాల్లో దాదాపు 15 – 16 స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పూర్తి స్థాయి పీసీసీ నియామకంపై హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రజావాణికి పొటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం
కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు