ETV Bharat / state

హస్తాగ్రహం: అసంతృప్తులు, అసహనాల మధ్య హస్తం నేతల భేటీ!

author img

By

Published : Dec 26, 2019, 10:40 PM IST

హైదరాబాద్​ గాంధీభవన్​లో జరిగిన కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం ఆగ్రహాలు, అసంతృప్తులు, అసహనాలతోనే సాగినట్లు కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. నేతల తీరు పట్ల పలువురు అసహనం వ్యక్తం చేయగా... ఇంకొందరు సమావేశం నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారట. ఇవన్నీ అటుంచితే... తెరాస, భాజపా నేతలు పాల్గొన్న ఏ సభ, సమావేశంలోనూ హస్తం నేతలు పాల్గొనకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు.

TELANGANA CONGRESS LEADERS UNSATISFACTORY ABOUT ACTIVISTS

రాష్ట్ర కాంగ్రెస్​ నాయకులు... పార్టీ వ్యవహారాలు, నేతల తీరు పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. హైదరాబాద్​ గాంధీభవన్‌లో నేడు జరిగిన ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహం, సీఎఎ, ఎన్‌ఆర్సీ ఆందోళనలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 28న తలపెట్టిన ర్యాలీ తదితర అంశాలపై చర్చించేందుకు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్​ నేత వీహెచ్​ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వీహెచ్​ వాకౌట్​... ఉత్తమ్​ కోపం...

కోర్‌ కమిటీ అని చెప్పి అందరినీ సమావేశంలో కూర్చోబెట్టారని వీహెచ్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు. అధికార పార్టీ నుంచి చిన్న నాయకులు తనపై ఆరోపణలు చేస్తుంటే... కాంగ్రెస్‌ నుంచి ఏ ఒక్కరు ఖండించలేదని ఉత్తమ్​కుమార్​రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గతంగానూ... కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని, అయినా ఎవరు మాట్లాడడం లేదని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కూడా తన అసహనాన్ని తెలిపినట్లు సమాచారం.

అధ్యక్షుని దిశానిర్దేశం...

తెరాస నాయకుల ఆరోపణలను దీటుగా తిప్పి కొట్టాలని... నాయకులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ పేర్కొన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో తెరాస, బీజేపీ నేతలు పాల్గొనే ఏ సభలు, సమావేశాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎవరు భాగస్వామ్యం కాకూడదని సమావేశంలో నేతలు గట్టి నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.