ETV Bharat / state

'కేసీఆర్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదు' - Telangana news

ముఖ్యమంత్రి కేసీఆర్​పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు.

'కేసీఆర్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదు'

author img

By

Published : Dec 29, 2020, 8:01 PM IST

'కేసీఆర్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదు'

రైతులను మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం... అవసరమా అని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్​ గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో కలిసి అయన మీడియా సమావేశం నిర్వహించారు.

కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారని... పార్టీ తరఫున తామేం చేయాలనేదానిపై కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి వచ్చే నెల 7 వరకు మండలాల్లో నిరసనలు.. ఎమ్మార్వోలకు వినతి పత్రాల అందజేత కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు.

రెండు మూడు రోజుల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఉత్తమ్ తెలిపారు. 11న జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు, 18న రాష్ట్ర వ్యాప్త పోరాటాలు... మధ్యలో ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు.

కొత్త వ్యవసాయ చట్టాలతో మద్దతు ధర పొందే హక్కును రైతులు కోల్పోతారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ముందు ఆ చట్టాలను ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు. భాజపా, తెరాస ఒక్కటేనని తాము మొదటి నుంచి చెబుతున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్ రైతు ధర్నాలో వేసుకున్న ముసుగు నిన్నటితో తొలిగిపోయిందని భట్టి వివరించారు.

ఇదీ చదవండి : "కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.