T Congress Campaign on Govt Failures : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(TPCC President Revanth Reddy) అధ్యక్షతన జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న అంశంతో పాటు ఏయే అంశాలను జనంలోకి తీసుకెళ్లాలి, సభలు, సమావేశాలు నిర్వహణ, తాజా రాజకీయ పరిస్థితులు, చేరికలు తదితర అంశాలపై చర్చించారు.
తిరగబడదాం-తరిమికొడదాం అన్న నినాదంతో మొదట రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు నాయకులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. ఇందుకోసం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Chevella Congress Pubilc Meeting : ఖమ్మం సభను విజయవంతం చేసినట్లుగా ఈ నెల 26వ తేదీ సాయంత్రం చేవెళ్లలో జరగనున్న ప్రజాగర్జన ఖర్గే సభ(Congress Chevella Praja Garjana Sabha)ను కూడా విజయవంతం చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విడుదల చేస్తారు. ఈ నెల 29వ తేదీన మైనారిటీ డిక్లరేషన్‌ను వరంగల్‌లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఓబీసీ, మహిళ డిక్లరేషన్లు సిద్ధం చేసేందుకు సబ్ కమిటీ నియమించనుంది. మహిళ డిక్లరేషన్ విడుదలకు ప్రియాంకగాంధీ(Priyanka Gandhi)ని.. మేనిఫెష్టో విడుదలకు సోనియాగాంధీ(Sonia Gandhi)లను పీసీసీ ఆహ్వానించనుంది.
Telangana Congress Door to Door Yatra : ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రజా వ్యతిరేఖ విధానాలపై ప్రచారం పూర్తి చేసిన తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఇంటింటికీ తీసుకెళుతుందని స్పష్టం చేసింది. ప్రజల్లో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేఖత ఉందని అంచనా వేస్తున్న కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో 75 నుంచి 80 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. పార్లమెంటుకు రెండు లెక్కన 34 టికెట్లు బీసీలకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే పీసీసీ ప్రకటించింది. అయినా కూడా గాంధీభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమైన బీసీ నాయకులు బలమైన బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 48 నియోజకవర్గాల్లో బీసీలు బలంగా ఉన్నట్లు పేర్కొంటున్న బీసీ నాయకులు.. 65 స్థానాల్లో పోటీ చేసేందుకు నేతలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంతో పాటు స్క్రీనింగ్ కమిటీలో బీసీలకు చోటు కల్పించాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్రావ్ ఠాక్రే(t congress State Affairs Incharge Manik Rao Thakre)ని కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
T Congress Assembly Ticket Application : నేటి నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్కు దరఖాస్తు ప్రక్రియ