ETV Bharat / state

Commercial Taxes: మొదటి క్వార్టర్‌లో వృద్ధి... కరోనా ప్రభావం అంతంతమాత్రమే! - Telangana commercial tax collections

రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయంపై కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. దాదాపు మూడువేల కోట్లు జీఎస్టీ పరిహారం కేంద్రం నుంచి రావడం వల్ల భారీగా వృద్ధి నమోదు చేసింది. మొదటి మూడు నెలల్లో అంతకు ముందు రెండు సంవత్సరాల్లో మొదటి క్వార్టర్​లో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ రాబడి వచ్చింది.

Telangana
కరోనా
author img

By

Published : Jul 24, 2021, 12:05 PM IST

మొదటి దశ కరోనా ప్రభావంతో 2020-21 ఆర్థిక ఏడాది మొదటి క్వార్టర్‌లో వాణిజ్య రాబడులు భారీగా పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే రూ. నాలుగు వేలు కోట్లు తగ్గింది. కాని రెండోదశ కరోనా ప్రభావం ఈ ఆర్థిక ఏడాదిలో వాణిజ్య పన్నుల రాబడులపై అంతగా పడలేదు. దీనికి తోడు కేంద్రం నుంచి దాదాపు మూడువేల కోట్లు జూన్‌, జులై నెలలో జీఎస్టీ పరిహారం వచ్చింది. దీంతో ఈ ఆర్థిక ఏడాది మొదటి క్వార్టర్‌లో భారీగా వృద్ధి నమోదు అయ్యింది.

2019-20 ఆర్థిక ఏడాదిలో మొదటి క్వార్టర్‌లో రూ.14,780 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.10,392 కోట్లు, 2021-22 ఆర్థిక ఏడాదిలో పరిహారంతో నిమిత్తం లేకుండా రూ.12,133 కోట్లు ఆదాయం వచ్చింది.

వ్యాట్ రూపంలో...

గత ఆర్థిక ఏడాదిలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై వ్యాట్‌ రూపంలో మొదటి మూడు నెలల్లో రూ. 911.08 కోట్లు రాబడిరాగా ఈ ఆర్థిక సంవత్సరం అదే సమయంలో రూ.2,957.36 కోట్లు వ్యాట్‌ రాబడి వచ్చింది. లిక్కర్‌ విక్రయాలపై వ్యాట్‌ రాబడి గత ఆర్థిక ఏడాది మొదటి మూడు నెలల్లో రూ.1,425 కోట్లు వ్యాట్‌ ఆదాయం రాగా ఈ ఆర్థిక సంవత్సరం అదే మొదటి క్వార్టర్‌లో రూ.2,875.30 కోట్లు వచ్చింది. వస్తు సేవల పన్ను-జీఎస్టీ కింద గత ఆర్థిక ఏడాది మొదటి మూడు నెలల్లో రూ.6,276 కోట్లు రాబడి రాగా... ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రూ12,133 కోట్లు ఆదాయం వచ్చింది.

ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది జూన్‌లో రూ.683.24 కోట్లు, జులైలో రూ. 2,155.25 కోట్లు లెక్కన మొత్తం కలిసి రూ.2838.49 కోట్లు మొత్తం పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వానికి జమైంది. ఈ పరిహారంతో కలిపితే రూ.14,965.57 కోట్లు రాబడి వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఆశించిన రాబడులు...

మొదటి దశ కరోనా సమయంలో లాక్‌డౌన్‌ ఎక్కువ రోజులు అమలు కావడం... వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడంతో ఆ ప్రభావం వాణిజ్య రాబడులపై తీవ్రంగా పడింది. రెండో దశలో వాణిజ్య కార్యకలాపాలు కొంత తగ్గినప్పటి కరోనా ప్రభావం అంతగా కనిపించలేదు. మే నెలలో రాబడులపై కొంత ప్రభావం పడినప్పటికీ ఏప్రిల్‌, జూన్‌ నెలల్లో రాబడులు ఆశించిన మేరకు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: ఉద్యోగ నియామకాలు, పదోన్నతులన్నింటికీ కొత్త జిల్లాలే ప్రాతిపదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.