ఉత్తరాఖండ్ వరద దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు క్షేమంగా బయటపడాలని.. భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
దేవభూమిలో..
దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి జల విలయం బీభత్సం సృష్టించింది. జోషిమఠ్ వద్ద నందాదేవీ హిమానీనదం కట్టలు తెంచుకోవడం వల్ల చమోలీ జిల్లా రేనీ తపోవన్ వద్ద రిషి గంగా నదికి ఆకస్మిక వరదలు సంభవించాయి. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రిషిగంగా జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రిషి గంగా, ధౌలీ గంగా నది సంగమం వద్ద ఉన్న ఎన్టీపీసీకి చెందిన మరో జల విద్యుత్ ప్రాజెక్టు పాక్షికంగా ధ్వంసమైంది. వరదల ధాటికి రెండు ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న170 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఏడుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. 16 మందిని సహాయక సిబ్బంది కాపాడినట్లు స్పష్టం చేసింది.
ఇవీచూడండి: దేవభూమిలో ప్రళయం- 170 మంది గల్లంతు!