ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులు అప్పుల బాధ నుంచి విముక్తి కలిగి.. తలెత్తుకొని తిరుగుతున్నారంటే అందుకు కేసీఆరే కారణమన్నారు. కరోనా సమయంలోనూ రైతుబంధు సాయాన్ని అందించినట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీలు కేకే, సంతోష్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పోచారం సూచించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి.. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జలవిహార్‌లో మొక్కలు నాటారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే.. కేసీఆర్ నూరేళ్లు జీవించాలి. -గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన మండలి ఛైర్మన్
ఏదైనా సమస్య వస్తే కేసీఆర్ మైక్రోలైవల్ వరకు అధ్యయనం చేస్తారు. అనంతరం దానికి పరిష్కారం దొరికేవరకు ప్రయత్నం చేస్తారు.
-వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలి. ఆయన .. రాష్ట్రానికే కాకుండా దేశానికి సేవచేయాలని కోరుకొనేవాడిలో తాను ఒకడిని.
- కేకే, రాజ్యసభ సభ్యుడు
ఇవీచూడండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్