ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన బాట పడుతున్నారు. రేపు ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ాఆర్థిక మాంద్యం వల్ల కలుగుతున్న ఇబ్బందులతో పాటు... పలు ఇతర అంశాలపై ఆయన ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్రానికిచ్చే నిధులు పెంచడంతో పాటు.. పాత బకాయిలు త్వరగా పంపాలని ఆయన ప్రధానిని కోరనున్నారు. వీటితో పాటు ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు.
ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి