ETV Bharat / state

cabinet meeting: ఈ ఏడాది రూ.50వేలలోపు రుణమాఫీ.. ఈడబ్ల్యూఎస్‌ వారికి తీపికబురు - తెలంగాణ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గ భేటీ సమావేశమైంది. జిల్లాల్లో కొవిడ్​ పరిస్థితులు, కొవిడ్​ వల్ల అనాథలయిన పిల్లలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలపై సమీక్షించారు.

telangana-cabinet-meeting-is-ongoing
telangana-cabinet-meeting-is-ongoing
author img

By

Published : Aug 1, 2021, 1:37 PM IST

Updated : Aug 1, 2021, 9:44 PM IST

ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్​... వివిధ అంశాలపై ఏడు గంటలపాటు సుదీర్ఘ చర్చించింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి... అనాథలుగా మారిన పిల్లల వివరాలు సేకరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

కేబినెట్​ నిర్ణయాలు:

  • సబ్​ కమిటీ ఏర్పాటు

అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలపై మంత్రిమండలి సమావేశంలో సమీక్షించారు. అవగాహన, విధాన రూపకల్పన కోసం మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్‌ కమిటీ సభ్యులుగా హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్​, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉన్నారు.

  • జిల్లాల్లో కరోనా పరిస్థితిపై చర్చ

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంపై కేబినెట్​లో చర్చించారు. కేసుల కట్టడికి సంబంధించి జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్, పడకలు, ఔషధాలపై సమీక్షించిన మంత్రిమండలి... జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని మంత్రి వర్గం ఆదేశించింది. పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని తెలిపింది. ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులుకు ఆదేశించారు.

  • ఏర్పాట్లు చేసుకోండి

రాష్ట్రంలో మంజూరైన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టల్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది. భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు కేబినెట్​ సూచించింది.

  • 5 సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులు

కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించారు. వీటి సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై సమాలోచనలు జరిగాయి. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్, చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణం, టిమ్స్, ఎల్బీనగర్​ గడ్డి అన్నారం, ఆల్వాల్​లో... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. పటాన్​చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు.

  • అన్నింటికీ అదేపేరు..

అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లను ఇక నుంచి "తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)" గా నామకరణం చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.

  • పత్తిసాగుపై ప్రత్యేక చర్చ

రాష్ట్రంలో పత్తిసాగుపై కేబినెట్​ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని... అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను మంత్రి మండలి ఆదేశించింది. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై చర్చించారు.

  • ఈ ఏడాది రూ.50వేలలోపు రుణమాఫీ

రుణమాఫీపై అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు పంటరుణ మాఫీ వివరాలను ఆర్థిక అందజేసింది. కరోనా వల్ల రెండేళ్లుగా రూ.25 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని... ఈ ఏడాది రూ.50 వేలలోపు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి రుణమాఫీ చేపట్టాలని... రూ.50వేల రుణమాఫీని ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

  • ఈడబ్ల్యూఎస్‌ వారికి గుడ్​న్యూస్​

కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై మంత్రివర్గంలో చర్చకొచ్చింది. రూ.8 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ వారికి వయోపరిమితి పెంచాలని... వారికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

  • 57 ఏళ్ల వారికి పింఛన్‌

వృద్ధాప్య పింఛన్ల అర్హత 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్‌ ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. అర్హత తగ్గింపు నిర్ణయంతో మరో 6.62 లక్షల కొత్త పింఛన్లు పెరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్ధతి కొనసాగించాలని నిర్ణయించింది. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.

  • ఉచిత విద్యుత్‌

ధోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను వారంలోగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం నిర్ణయం నిర్ణయించింది.

Last Updated : Aug 1, 2021, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.