ETV Bharat / state

ఎన్నికల్లో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం - మధ్యాహ్నం తరువాత పోలింగ్‌ కేంద్రాల వద్ద పెరిగిన రద్దీ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ 2023

Telangana Assembly Elections Polling 2023 : ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైన ఆయుధం ఓటు.. మంచి పాలన కావాలంటే జీవించి ఉన్నంతకాలం వినియోగిస్తూనే ఉండాలి. వయసు, అనారోగ్యం వంటివేవీ అందుకు అడ్డురావని నిరూపిస్తున్న వారంతా నడకలేకపోయినా, వయస్సు పైబడినా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు.

Telangana Assembly Elections Polling 2023
Telangana Assembly Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 4:47 PM IST

Updated : Nov 30, 2023, 6:31 PM IST

Telangana Assembly Elections Polling 2023 : ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు ఆసక్తి చూపారు. కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నా వెనకడుగు వేయకుండా పొలింగ్‌ కేంద్రాలకు(Polling Stations) తరలివచ్చి ఓటు వేశారు. యువకులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటు వేశారు. ఆరోగ్య సమస్యలున్నా ఓటు వేయాలనే సంకల్పంతో పక్కన మనిషి, చేతికర్ర సాయంతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి క్యూలైన్‌లో ఉండి నచ్చిన అభ్యర్థికి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు.

Senior Citizens Voting in Telangana : హైదరాబాద్‌ నారాయణగూడలో ఓటు వేసేందుకు వయోవృద్ధులు, దివ్యాంగులు ఆసక్తి చూపారు. తార్నాకలో 87 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేసి నచ్చిన అభ్యర్థిని ఎన్నుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన శేషయ్యకి 75 ఏళ్లు. తీవ్రమైన లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయినా ఓటు వేయాలనే పట్టుదలతో ఆక్సిజన్ సిలిండర్‌ సాయంతో గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌కి వచ్చి ఓటువేశాడు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతీఒక్కరూ నచ్చిన నాయకుల్ని ఎన్నుకోవాలని సూచించారు. జగిత్యాల గ్రామీణ మండలం పొలాసలో 105 ఏళ్ల రుక్కమ్మ.. అనే వృద్దురాలు ఓటువేసింది. ఆమెను వీల్‌ ఛైర్‌లో తీసుకు వచ్చి ఓటు వేయించారు. 105 ఏళ్ల వయస్సులో ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయటం ఆనందంగా ఉందని వృద్ధురాలు తెలిపింది.

ఆక్సిజన్ సిలిండర్​తో పోలింగ్​ కేంద్రానికి - బతికున్నంత వరకు ఓటేస్తానంటున్న శేషయ్య

Handicapped People Voting in Telangana : కరీంనగర్‌కి చెందిన అరుణ్ అనే దివ్యాంగుడు రెండు చేతులు లేకపోయినా.. పొలింగ్‌ కేంద్రానికి వచ్చి మరీ ఓటుహక్కు వినియోగించుకున్నాడు. చిన్నతనంలోనే విద్యుత్‌ షాక్‌గురై రెండు చేతులు పోగొట్టుకున్న అరుణ్.. 18 సంవత్సరాల క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు ప్రొసీడింగ్ అధికారి కాలివేలికి చుక్కపెట్టి ఓటుహక్కు పత్రాలు అందించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కి జాకీర్‌పాషా పుట్టుకతోనే దివ్యాంగుడు. రెండు చేతులు లేకపోయినా అధైర్యపడకుండా ముందడుగు వేస్తున్నాడు. దైనందిన జీవితంలో సాధారణపనులన్నీ కాళ్లతోనే చేసుకుంటున్నాడు. ఎన్నికల్లో తనవంతు బాధ్యతగా పాల్గొని కాలితో ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

పట్టణ ప్రాంతాల్లో పోలింగ్​ పుంజుకుంటుందని ఆశిస్తున్నాను : వికాస్​ రాజ్​

Youth Voting in Telangana 2023 : రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని యువత పిలుపునిచ్చింది. తొలిసారి ఓటుపొందిన యువకులు.. పెద్దసంఖ్యలో పొలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. జగిత్యాల జిల్లాలో భారీగా వచ్చిన యువఓటర్లు దేశ భవిష్యత్‌ను మార్చేందుకు ఓటు వేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మం హార్వెస్ట్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి పెద్దసంఖ్యలో యువకులు తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు.

Telangana Assembly Elections Voting 2023 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువతీ యువకుల కోసం యువ ఆదర్శ ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్‌ కేంద్రంలో 2500 మంది ఓటర్లు ఉండగా భారీగా తరలివచ్చారు. నిజామాబాద్‌లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడంపై యువత ఆనందం వ్యక్తం చేసింది. ఓటు ద్వారా ఎన్నుకున్న నాయకుడు గెలుపొంది అభివృద్ధికి తోడ్పడాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌ తూర్పు, జగిత్యాలతో పాటు.. బాన్స్‌వాడలోని తాడుకోల్‌లో టాన్స్‌జెండర్స్‌ ఓటు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ఓటు కల్పించటంపై సంతోషం వ్యక్తం చేశారు.

వయసు సహకరించకపోయినా - ఆరోగ్యం బాలేకపోయినా - తగ్గేదేలే అంటున్న ఓటర్లు

సిరా చుక్కతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే?

Last Updated : Nov 30, 2023, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.