ETV Bharat / state

గెలుపే మంత్రంగా.. లక్ష ఓట్లే టార్గెట్‌గా అభ్యర్థుల జపం - Parties campaign in Telangana assembly elections

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అయితే ఎన్నికల రాజకీయాలు రాష్ట్రమంతా ఎలా ఉన్నా రాజధాని హైదరాబాద్‌లో మాత్రం పూర్తి విభిన్నమేనని చెప్పవచ్చు. లక్ష ఓట్లు సాధించిన అభ్యర్థులు.. చాలావరకు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 60,000ల ఓట్లను రాబట్టుకోవడం ద్వారా గెలుపొందిన వారు ఉన్నారు. వారెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 12:33 PM IST

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్నికల ప్రచారం (Telangana election campaign) జోరుమీదుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచారు. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతావిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని వారికి తెలుసు. ఇందులో భాగంగా ఒక్క ఛాన్స్​ కోసం కొందరు.. మరో ఛాన్స్​ కోసం మరికొందరు తీవ్రంగా పోటీపడుతన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

Some Leaders Got one Lakh Votes in Hyderabad : హైదరాబాద్‌లో ఎమ్మెల్యేగా గెలిచి అధ్యక్షా అనాలంటే ఎన్ని ఓట్లు రావాలి? నగర శివార్లలో ఆరేడు లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. మరి గెలవాలంటే మూడు లక్షల ఓట్లైనా రావాలంటారా? గత శాసనసభ ఎన్నికల ఫలితాలు చూస్తే లక్ష ఓట్లు సాధించిన అభ్యర్థులు.. చాలావరకు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 60,000ల ఓట్లను రాబట్టుకోవడం ద్వారా విజేతగా నిల్చిన వారు ఉన్నారు.

త్రిముఖ పోరు ఇలా..

  • కల్వకుర్తిలో గతసారి బీఆర్ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు 62,750 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆచారి 59,160 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి 46,200 ఓట్లు సాధించారు. ఈసారి కూడా త్రిముఖ పోరు నెలకొంది.
  • గోషామహల్‌లోనూ 2018లో బీజేపీ అభ్యర్థి టి.రాజాసింగ్‌కు 61,806 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ప్రేంసింగ్‌రాథోడ్‌(బీఆర్ఎస్)44,092 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేశ్‌గౌడ్‌కు 26288 ఓట్లు సాధించారు. కానీ ఈసారి అక్కడ ద్విముఖ పోరే నెలకొంది.
  • ఖైరతాబాద్‌లో గతసారి దానం నాగేందర్‌(బీఆర్ఎస్‌) 63019 ఓట్లు సాధించారు. చింతల రాంచంద్రారెడ్డి(బీజేపీ)కి 34,623 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కు 33,505 ఓట్లు సాధించారు. ఈసారి కూడా త్రిముఖ పోరే.
  • గతసారి రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌కు 1.08 లక్షల ఓట్లు సాధించారు. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి గణేశ్‌ గుప్తాకు 50,397 ఓట్లు రాగా, ఎంఐఎం అభ్యర్థి మిర్జా రహ్మత్‌ బేగ్‌కు 46,528 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా త్రిముఖ పోరే.
  • మహేశ్వరంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి 94,967 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి 86,069 ఓట్లు, బీజేపీ నుంచి బరిలో దిగిన శ్రీరాములు 39,321 ఓట్లతో పోటీనిచ్చారు. ఈసారి కూడా ఇక్కడ త్రిముఖ పోటీనే.

సమయం లేదు మిత్రమా - అసెంబ్లీ పోలింగ్​కు ఈసీ చకచకా ఏర్పాట్లు

ఈసారి పోటాపోటీగా : గత ఎన్నికల్లో మేడ్చల్‌లో మల్లారెడ్డి (Minister Mallareddy) 1.67 లక్షల ఓట్లు సాధించారు. కుత్బుల్లాపూర్‌ కేపీ వివేకానంద 1.54 లక్షల ఓట్లు రాగా, శేరిలింగంపల్లిలో అరికపూడి గాంధీ 1.43 లక్షలు, పటాన్‌చెరులో గూడెం మహిపాల్‌రెడ్డి 1.16 లక్షలు, మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావుకు 1.13 లక్షల ఓట్లు వచ్చాాయి. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు 1.11 లక్షల ఓట్లు రాగా, ఉప్పల్‌ నుంచి భేతి సుభాష్‌రెడ్డి 1.17 లక్షలు, ఎల్బీనగర్‌లో సుధీర్‌రెడ్డి 1.13 లక్షల ఓట్లు సాధించి భారీ విజయం సాధించారు. ఈసారి పోటీ తీవ్రంగా ఉండటంతో ఎంతమంది.. లక్షకు పైగా ఓట్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారిన ఒకే పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు

ఎన్నికలు వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.