Telangana Assembly Election Polling Arrangements 2023 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా.. 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10 వరకు నామినేషన్లకు, 15వరకూ ఉపసంహరణకు తుది గడువు కాగా, హైదరాబాద్ పరిధిలో మొత్తం 15 నియోజకవర్గాలుండగా నామినేషన్ల కార్యాలయాల వద్ద కట్టుదిత్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. రిటర్నింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించటంతో పాటు.. 100 మీటర్ల లోపు ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దని అధికారులు హెచ్చరించారు.
Telangana Election Polling Arrangements 2023 : ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్‌దత్ అన్నారు. హైదరాబాద్ చిలకలగూడ, వారాసిగూడ పరిధిలో జరిగిన కవాతులో పాల్గొన్న సునీల్‌దత్.. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పర్యటించారు. జరుగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని సిక్ చౌహానీలో సిక్కు కమ్యూనిటీతో సమావేశమ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలి కోరారు. ఎప్పటికప్పుడు ప్రతి విషాయన్ని పోలీసులుకు తెలియజేయాలని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
Police Arrangements For Telangana Election : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు రూట్ మార్చ్ చేశారు. మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్సైలు సిబ్బందితో పాటు దాదాపు 200 మంది ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ స్టేషన్ నుంచి ప్రారంభమైన పోలీసులు సమస్యాత్మక ప్రాంతమైన భోలక్పూర్, ఇందిరానగర్, బడి మజీద్, అంజుమన్ వీధి, కట్నికాంట, పద్మశాలి కాలనీ, కట్టెల మండి, బైబిల్ హౌస్ తదితర ప్రాంతాల్లో మార్చ్ పాస్ట్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరు అభద్రతాభావంతో ఉండవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. పోలీసు రూట్ మార్చ్‌లో కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు కూడా పాదయాత్ర చేస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.
పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ ప్రియదర్శిని.. రక్తదానం ప్రాణదానంతో సమానమని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు అందరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు. ఎన్నికల కోసం కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసు సిబ్బంది, యువకులు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.