Telangana Assembly Election Campaign 2023 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన 4 శాతం ముస్లిం రిజ్వేషన్లను తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అధికారికంగా విమోచన దినోత్సవంతో పాటు బీసీ ముఖ్యమంత్రి హామీ నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్ అంబర్‌పేట్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి కృష్ణయాదవ్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌కు మద్దతుగా జరిగిన మేధావులు, నివాసితుల సంక్షేమ సంఘం సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. మోదీ హయాంలో దేశం సాధించిన ఘనతను ఆయన వివరించారు. కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అమర్‌సింగ్‌తో కలిసి రాజ్‌నాథ్‌సింగ్ రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను ఓడించాలని ఆయన కోరారు.
సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్‌లో ఆ కుటుంబానికి సర్ప్రైజ్
BJP Election Campaign in Telangana 2023 : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాయమాటలతో మోసం చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలని అర్వింద్ కోరారు. హనుమకొండలో పర్యటించిన బీజేపీ స్టార్ క్యాంపైనర్ కృష్ణ ప్రసాద్.. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కులేదన్న ఆయన.. తెలంగాణలో ఎలా అమలు చేస్తారన్నారు.
ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కోరుతూ.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఆయన సతీమణి ఈటల జమున ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో బీజేపీ అభ్యర్థి భూక్యా సంగీత ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి దన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా నగరంలో ప్రచారం చేశారు.
Congress Election Campaign Telangana 2023 : నిజామాబాద్ జిల్లా పోతాంగల్‌లో బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చౌహాన్ ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాక అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ మద్దతుగా కోహిర్ మండలం చింతల్‌ఘాట్‌లో ఏఐసీసీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సుప్రియ శ్రీనేత్ ప్రచారం చేశారు.
బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్ షా
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంటింటికి వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు. ఇటీవల పార్టీని వీడిన నర్సాపూర్ ఎంపీపీ దంపతులు రాజిరెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు.. హవేలీఘన్‌పూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి పర్యటనలో మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణల పట్ల కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతురావు ఎదురుదాడి చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
Door to Door Election Campaign : మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్.. కర్ణాటకకు చెందిన పార్టీ నేత ఎన్.హెచ్శివశంకర్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి రామచందర్‌నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరాకు మద్దతుగా ధర్మసాగర్ మండలంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రచారం నిర్వహించారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి మద్దతుగా తీన్మార్ మల్లన్న ప్రచారం చేశారు. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలంలోని గ్రామాల్లో ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల వాసులు ఆమెకు ఆటాపాటలతో ఘనస్వాగతం పలికారు. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ఉప్పునుంతల మండలంలో ప్రచారం చేశారు. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తీరు పట్ల ఆవేదనకు గురై ఆ పార్టీ యువజన విభాగం నేతలు రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి ప్రచారం చేశారు.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆకాంక్షలను పదేళ్ల పాలనలో ఒక కుటుంబం సర్వనాశనం చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన.. బ్రాండ్ తెలంగాణ తీసుకురావడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు.
Congress Leaders Comments on BRS : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదని, కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడ్డారని సీడబ్ల్యూసీ సభ్యురాలు సుప్రియా శ్రీనటే ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జి, సీడబ్ల్యూసీ సభ్యుడు అజోయ్‌కుమార్ జోస్యం చెప్పారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరికీ పోస్టల్ బ్యాలెట్ అందటంలేదంటూ.. పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణాలో ఎన్నికల సంఘం ఓటరు స్లిప్పులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. హైదరాబాద్ ముషీరాబాద్ సీపీఎం అభ్యర్థి దశరథ్‌కు మద్దతుగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిని అలీ ప్రచారం చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కుమురంభీం జిల్లా పెంచికలపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలు - గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు