RTO Codes of Telangana Districts : తెలంగాణ ఏర్పాటు తర్వాత.. రాష్ట్ర రవాణా శాఖ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు టీఎస్(TS) పేరుతో నంబర్ ప్లేట్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం మొదటగా ఉన్న 10 జిల్లాలకు నూతన వాహన రిజిస్ట్రేషన్ కోడ్లను కేటాయించిన తెలంగాణ రవాణా శాఖ(Telangana Transport Department).. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాలకూ కొత్త రిజిస్టేషన్ కోడ్లను జారీ చేసింది.
Telangana RTO Vehicles Registration Codes : ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్‌ను రవాణా శాఖ కేటాయిస్తోంది. మరి, మీ కొత్త వాహనానికి ఏ రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుందో తెలుసా? ఇప్పుడు మీరు నడుపుతున్న వాహనం నంబర్ ప్లేట్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ కోడ్ మాత్రమే మీకు కొనసాగుతోందా? లేదా.. కొత్త కోడ్ పరిధిలోకి వెళ్లిపోయారా? అనేది ఇక్కడ తెలుసుకోండి.
Telangana Vehicles Registration Process in Telugu : మోటారు వాహన చట్టం(Motor Vehicles Act) 1988లోని ఆర్టికల్ 213లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా.. తెలంగాణ రవాణా మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. ప్రజల భద్రతను నిర్ధారించే బాధ్యత రవాణా శాఖపై ఉంది. ఇందులో భాగంగానే రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ (RTO) పనిచేస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆమోదించడం, వివిధ రకాల వాహనాలకు లైసెన్సులు ఇవ్వడం, అన్ని రకాల వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడం లాంటి వివిధ విధులను ఆర్టీవో నిర్వర్తిస్తోంది. అలాగే.. వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు మంజూరు చేస్తుంది. ఇప్పుడు మనం.. తెలంగాణలో జిల్లాల వారీగా ఆర్టీవో జారీ చేసే వాహన రిజిస్ట్రేషన్ కోడ్స్ తెలుసుకుందాం.
వాహన రిజిస్ట్రేషన్ పక్కాగా లేకపోతే ఇంక తిప్పలు తప్పవు
జిల్లాల వారీగా వాహన రిజిస్ట్రేషన్ కోడ్స్ ఇవే..
జిల్లా పేరు | RTO Code |
ఆదిలాబాద్ | TS 01 |
కరీంనగర్ | TS 02 |
వరంగల్ అర్బన్ | TS 03 |
ఖమ్మం | TS 04 |
నల్గొండ | TS 05 |
మహబూబ్ నగర్ | TS 06 |
రంగారెడ్డి | TS 07 |
మేడ్చల్-మల్కాజిగిరి | TS 08 |
హైదరాబాద్ సెంట్రల్ | TS 09 |
హైదరాబాద్ నార్త్ | TS 10 |
హైదరాబాద్ తూర్పు | TS 11 |
హైదరాబాద్ సౌత్ | TS 12 |
హైదరాబాద్ వెస్ట్ | TS 13 |
హైదరాబాద్ | TS 14 |
సంగారెడ్డి | TS 15 |
నిజామాబాద్ | TS 16 |
కామారెడ్డి | TS 17 |
నిర్మల్ | TS 18 |
మంచిర్యాల | TS 19 |
కుమురం భీం ఆసిఫాబాద్ | TS 20 |
జగిత్యాల | TS 21 |
పెద్దపల్లి | TS 22 |
రాజన్న సిరిసిల్ల | TS 23 |
వరంగల్(రూరల్) | TS 24 |
జయశంకర్ భూపాలపల్లి | TS 25 |
మహబూబాబాద్ | TS 26 |
జనగాం | TS 27 |
భద్రాద్రి కొత్తగూడెం | TS 28 |
సూర్యాపేట | TS 29 |
యాదాద్రి భువనగిరి | TS 30 |
నాగర్ కర్నూల్ | TS 31 |
వనపర్తి | TS 32 |
జోగులాంబ గద్వాల్ | TS 33 |
వికారాబాద్ | TS 34 |
మెదక్ | TS 35 |
సిద్దిపేట | TS 36 |
ములుగు | TS 37 |
నారాయణపేట | TS 38 |
Vehicle Registration Process Telangana :
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. రాష్ట్రంలో RTO కింద వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతోంది. అయితే.. ఏదైనా వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాలి. వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీరు అప్లికేషన్ సమయంలో కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పత్రాలు ఏంటో ఓసారి చూద్దాం..
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలివే..
- ఫారమ్ నంబర్ 20-అప్లికేషన్
- ఫారమ్ నంబర్ 21-సేల్స్ సర్టిఫికెట్
- ఫారమ్ నం 22- రోడ్డు క్వాలిటీ సర్టిఫికెట్
- నివాస ధ్రువీకరణ పత్రం
- PUC సర్టిఫికేట్
- తెలంగాణ మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం చెల్లించిన పన్ను రశీదు.
Vehicles Increasing In Hyderabad : భాగ్యనగరంలో భారీగా కొత్త వాహనాల కొనుగోళ్లు.. ఎక్కువగా అవేనట..!