ETV Bharat / state

Governor tweet on students: 'విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది..'

Governor tweet on students: విద్యార్థుల ఆరోగ్యం పట్ల తాను తీవ్ర కలత చెందుతున్నాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థి చేసిన ట్వీట్​పై ఆమె స్పందించారు.

author img

By

Published : Jun 16, 2022, 4:15 PM IST

Governor tweet  On Basara:
రాష్ట్ర గవర్నర్ తమిళిసై

Governor tweet on students: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జియూకేటీ విద్యార్థి చేసిన ట్వీట్​పై ఆమె స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల తాను ఆందోళనకు గురవుతున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గవర్నర్ కోరారు. వర్షంలోనూ తడుస్తూ విద్యార్థులు పోరాటం చేయడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • I am concerned on seeing you all agitating even in rains.Please take care of your health to fullfill your parent's dreams & your goals.with best of my efforts i will convey your grievances to the concerned authorities for redressel @TelanganaCMO

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) June 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆర్జీయూకేటీలో సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని భైంసా ఏఎస్పీ తెలిపారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. డైరెక్టర్ నియామకం గురించి విద్యార్థులకు చెప్పామని అన్నారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపేశామన్న వార్తల్లో వాస్తం లేదని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులందరికి కూడా ఆహారం, నీళ్లు అందుతున్నాయని చెప్పారు.

ఇవీ చదవండి:

'డైరెక్టర్​తో సమస్యలు పరిష్కారం కావు.. కేసీఆర్ రావాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.