రాష్ట్రంలో వెంటనే మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళా సంఘాల సమాఖ్య సమితి.. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో డిమాండ్ చేసింది. కమిషన్ లేకపోవడం వల్ల మహిళల సమస్యలు పరిష్కారం కావడం లేదని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఎక్కడ.. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని సమాఖ్య ప్రతినిధి సత్యవతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవీ చూడండి: కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు