ETV Bharat / state

నేటి నుంచి వర్క్​టు రూల్​గా పనిచేయనున్న తహసీల్దార్లు - నేటి నుంచి వర్క్​టు రూల్​గా పనిచేయనున్న తహసీల్దార్లు

బదిలీలు సహా డిమాండ్ల సాధన కోసం మంగళవారం నుంచి సాయంత్రం 5గంటల వరకే పనిచేస్తామని తహసీల్దార్ల సంఘం తెలిపింది. ఈ మేరకు సీఎస్​ కార్యాలయంలో నోటీసులు అందజేశారు.

నేటి నుంచి వర్క్​టు రూల్​గా పనిచేయనున్న తహసీల్దార్లు
author img

By

Published : Jul 9, 2019, 6:54 AM IST

ఎన్నికల సమయంలో బదిలీ చేసిన తహసీల్దార్లను వెంటనే సొంత జిల్లాలకు పంపించి, సాధారణ బదిలీలు చేపట్టాలంటూ తహసీల్దార్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసేందుకు ఆ సంఘం ప్రతినిధులు సచివాలయానికి వచ్చారు. సీఎస్ అందుబాటులో లేనందున కార్యాలయంలో నోటీసులు అందజేశారు. తమ డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి వర్క్ టూ రూల్‌గా... ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామని తెలిపారు. భోజన విరామ సమయంలో కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల కార్యాలయంలో నిరసన తెలుపుతామని, ఈ నెల 15 వ తేదీ నుంచి సామూహిక సెలవుల్లో వెళ్తామని హెచ్చరించారు.

నేటి నుంచి వర్క్​టు రూల్​గా పనిచేయనున్న తహసీల్దార్లు

ఇదీ చూడండి: సర్వాంగసుందరంగా ముస్తాబవుతోన్న యాదాద్రీశుడి ఆలయం

Intro:అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడు బాలికల గురుకుల పాఠశాలలో యోగా దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు

Body:గురుకుల పాఠశాల విద్యార్థిని లో వివిధ యోగాసనాలు సునాయాసంగా చేసి యోగ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలను తెలియజేశారు

Conclusion:ఈ కార్యక్రమంలో లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సునీత yoga ఉపాధ్యాయురాలు విద్య ఆచార్య బృందము పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.