ETV Bharat / state

భవిష్యత్తులో ఒకటో నంబరు ఇంధనం హరిత హైడ్రోజన్ - Future is bio hydrogen

పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఏటా వినియోగం పెరుగుతుండటంతో మరి కొన్నేళ్లలో కొరత తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారమే పర్యావరణానికి హాని కలిగించని హైడ్రోజన్‌ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

భవిష్యత్తులో ఒకటో నంబరు ఇంధనం హరిత హైడ్రోజన్

author img

By

Published : Feb 21, 2021, 7:25 AM IST

పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఏటా వినియోగం పెరుగుతుండటంతో మరి కొన్నేళ్లలో కొరత తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారమే పర్యావరణానికి హాని కలిగించని హైడ్రోజన్‌ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ‘‘భవిష్యత్తులో ఇది ఒకటో నంబరు ఇంధనం కాబోతోంది. శిలాజ ఇంధనాలకు హైడ్రోజన్‌ ప్రత్యామ్నాయం అనే ఆలోచన పదేళ్ల క్రితం నుంచి ఉన్నా.. మధ్యలో దీని గురించి అంతగా పట్టించుకోలేదు.

మూడు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ హైడ్రోజన్‌పై చర్చ జరుగుతోంది. మనదేశంలో ఇటీవలే జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ గురించి ప్రకటించారు. వ్యర్థాల నుంచి కాలుష్యం వెదజల్లని హరిత(గ్రీన్‌) హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల కాలుష్యంతో పాటు వ్యర్థాల సమస్యకూ పరిష్కారం లభించినట్లు అవుతుంది’’ అని దీనిపై పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.వెంకటమోహన్‌ అన్నారు.

ప్రపంచంలోనే తొలిసారి ఈ సాంకేతికతను ఐఐసీటీ 2017లో అభివృద్ధి చేసింది. అప్పట్లోనే 50 వేల లీటర్ల సామర్థ్యంతో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. మూడు నెలలపాటు విజయవంతంగా నడిపారు కూడా. ఎవరైనా ముందుకొస్తే సాంకేతికతను బదలాయించనున్నారు.

ఎక్కువ వాడకం పెట్రో కెమికల్స్‌, ఎరువుల్లో...

హైడ్రోజన్‌ను ఎక్కువగా పెట్రోకెమికల్స్‌, ఎరువుల్లో ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం చాలావరకు దీనిని సహజవాయువు నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున బొగ్గు పులుసు వాయువు వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. దీని స్థానంలో హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగలిగితే.. వాహనాల్లో ఇంధనంగా వినియోగించగలిగితే కాలుష్యం, ఇంధన కొరత సమస్యలు తీరుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వాహనాల్లో వాడాలంటే..

హైడ్రోజన్‌ను ఇప్పటికిప్పుడు వాహనాల్లో వాడే పరిస్థితులు లేవు. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రత్యేకంగా హైడ్రోజన్‌ సెల్స్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. టాటా, మహీంద్ర వంటి ఆటోమొబైల్‌ సంస్థలు దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి.
* ప్రస్తుతం సీఎన్‌జీలోనే 18 శాతం హైడ్రోజన్‌ను కలిపి హెచ్‌సీఎన్‌జీగా దిల్లీలో ఉపయోగిస్తున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. ఏపీ కూడా ఒక ప్లాంట్‌ ఏర్పాటును పరిశీలిస్తోంది.
* హెచ్‌సీఎన్‌జీతో చాలా సానుకూలతలు ఉన్నాయి. వాహన కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు ఉన్న సీఎన్‌జీ వాహనాలను ఎలాంటి మార్పులు చేయకుండానే వాడుకోవచ్చు.

తయారీ రెండు రకాలుగా...

హరిత హైడ్రోజన్‌ను రెండు విధాలుగా తయారు చేయవచ్చని డాక్టర్‌ వెంకటమోహన్‌ అన్నారు. ‘‘నీటి నుంచి హైడ్రోజన్‌ను(వాటర్‌ ఎలక్ట్రాలసిస్‌) ఉత్పత్తి చేయవచ్చు. అలాగే వ్యర్థాల నుంచి కూడా. ఈ రెండూ హరిత హైడ్రోజన్‌ కిందకే వస్తాయి. ఐఐసీటీలో రెండో దానికి సంబంధించి సాంకేతికత సిద్ధంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.