ETV Bharat / state

Teachers Objections: ఉద్యోగుల విభజన ప్రక్రియ.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు - ఉద్యోగుల కేటాయింపుపై పిటిషన్లు

Teachers Objections: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా విభజన, కేటాయింపుల కోసం అన్ని స్థాయిల ఉద్యోగుల నుంచి గురువారం లోపు ఐచ్చికాలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీనియారిటీ, ప్రాధాన్యాలకు అనుగుణంగా 20వ తేదీలోగా కేటాయింపులు పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రత్యేక కేటగిరీలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పట్నుంచి వారం రోజుల్లోగా ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొంది.

Teachers petitions in high court
ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు
author img

By

Published : Dec 14, 2021, 5:05 AM IST

Teachers Objections: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ సహా రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీ పోస్టుల నియామక కమిటీలు ఏర్పాటు చేశారు. పాత జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు సైతం తీసుకున్నారు. నేడు ఓట్ల లెక్కింపు పూర్తి కానుండగా.. అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగుల విభజన, కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.

New zonal system in telangana: జిల్లా కేడర్‌తో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం సాధారణ పరిపాలనా శాఖ తేదీలు ఖరారు చేసింది. ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోవాల్సి ఉంటుంది. సీనియారిటీ జాబితా, ఉద్యోగులు ఇచ్చిన ప్రాధాన్యాలను పరిగణవలోకి తీసుకొని కేటాయింపులు చేస్తారు. ఎవరైనా ప్రత్యేక కేటగిరీల కింద దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం ఇప్పటికే నియమించిన అలాట్‌మెంట్ కమిటీలు 20వ తేదీలోగా కేటాయింపులు చేస్తూ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. కేటాయింపు ఆదేశాలు అందుకున్నప్పటి నుంచి ఉద్యోగులు వారం రోజుల్లోపు విధుల్లో చేరాల్సి ఉంటుంది. అటు జోనల్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగుల రిపోర్ట్ చేసేందుకు రిపోర్టింగ్ అథారిటీలను నియమించాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. సాయంత్రంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు

teachers petitions in high court: మరోపక్క కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ జిల్లాలకు చెందిన 228 ఉపాధ్యాయులు ఐదు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. ఉద్యోగుల కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 377 రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని వెల్లడించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం కేటాయింపులు చేస్తోందన్నారు. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.