ETV Bharat / state

పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన ఆయన... ఏపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారు: చంద్రబాబు
పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారు: చంద్రబాబు
author img

By

Published : Aug 29, 2020, 8:23 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు పరిపాలనలో అనుభవం లేదని, టాప్ 3లో ఉన్న రాష్ట్రాన్ని 20వ స్థానంలోకి దిగజార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో 130 సంస్థలను పోగొట్టి 60వేల ఉద్యోగాలు అందకుండా చేశారన్నారు. పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన ఆయన... ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

గన్నవరం రన్ వే విస్తరణకు భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖత్వంతో, వితండ వాదనతో ఏపీకి తీవ్ర నష్టం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రతి దానిలోనూ కుంభకోణాలే...

ఇసుక, మద్యం, భూములు, గనులు, ప్రతి దానిలో వైకాపా కుంభకోణాలకు పాల్పడిందన్న చంద్రబాబు... అవినీతి కుంభకోణాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. హత్యలు చేయడంలో, వాటిని ఆత్మహత్యలుగా చిత్రించడంలో వైకాపా నాయకులు సిద్దహస్తులని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.