Nara Lokesh Meeting with BC Leaders: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి అభివృద్ధిని ఆపేసి రాష్ట్రాన్ని చంపేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చిత్తూరు నియోజకవర్గం దిగువమాసపల్లి నుంచి 13వ రోజు లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు బీసీ నేతలతో, లోకేశ్ సమావేశమయ్యారు. టీడీపీ హయాంలో బీసీల కోసం నిర్వహించిన పలు సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను లోకేశ్ గుర్తు చేశారు.
Lokesh Yuvagalam padayatra in Chittoor district: సీమ జిల్లాల నుంచి వలసలు ఎక్కువయ్యాయని నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్లకు నిధులు కేటాయించి బీసీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించరాని దుయ్యబట్టారు. 90 శాతం పూర్తైన బీసీ భవనాల నిర్మాణ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ప్రభుత్వ సలహదారుల్లో 70 శాతం సొంత సామాజిక వర్గానికి చెందిన వారినే నియామించరాని ఆరోపించారు.
పాడిరైతుల గురించి మాట్లాడితే పేటియం బ్యాచ్ ట్రోలింగ్ చేస్తోందని నారా లోకేశ్ దుయ్యబట్టారు. రైతులకు డ్రిప్, ఇతర వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీల అభివృద్ధికి.. ఆదరణ పథకం కింద మొదటి విడతలో రూ. 1000 కోట్లు ఖర్చు చేశామన్నారు. రెండో విడత కోసం సామాగ్రి కొనుగోలు చేసి పంపీణి మొదలయ్యే సరికి ఎన్నికల నియామవళి వచ్చిందని తెలిపారు.
ఇవీ చదవండి :