తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌పై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర బంద్(ap bandh)కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్ (Tdp Leaders Arrest News) చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తెదేపా నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు.
బంద్ పిలుపు నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెదేపా నేతలు ఆందోళనకు (tdp leaders protest) దిగారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టగా వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయన్ను గృహనిర్బంధం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సాలూరు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తెదేపా శ్రేణులు నిలిపేశాయి. విశాఖ జిల్లాలోనూ పలువురు తెదేపా నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు 10 మంది తెదేపా నేతలను అరెస్ట్ చేశారు. తెదేపా కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ నిరసనలు కొనసాగాయి. పాడేరులో ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును గృహనిర్బంధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరులో తెదేపా నేత బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పెడనలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్‌ను గృహనిర్బంధం చేశారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బస్టాండ్ వద్ద టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
తెదేపా నేతల నిరసనల నేపథ్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు మోహరించారు. వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద బస్సులను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో పలువురు కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నరసరావుపేటలో తెదేపా శ్రేణులు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అరవిందబాబును అరెస్ట్ చేసి ఆయన్ను శావల్యాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెదేపా కార్యకర్తలు, నేతలు నిరసన తెలిపారు. బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. మార్కాపురం డిపో ఎదుట తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా గేటు ముందు బైఠాయించారు. నెల్లూరు జిల్లాలోనూ తెదేపా నేతలు ఆందోళనలు కొనసాగించారు. నెల్లూరు-కడప జాతీయ రహదారిపై నేతలు బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేపడుతున్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాయలసీమ జిల్లాల్లోనూ ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుమల వచ్చే యాత్రికులకు అసౌకర్యం కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేటలో బస్సులను అడ్డుకున్న తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరులో తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. తెదేపా ఆందోళనల నేపథ్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి సహా ఆ పార్టీ నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం తెదేపా ఇన్‌ఛార్జ్ తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలులో తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డోన్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేఈ ప్రభాకర్, నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిలను పోలీసులు గృనిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలువురు తెదేపా నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. గుంతకల్లులో జితేంద్రగౌడ్‌ను గృహనిర్బంధం చేశారు.
డీజీపీ కనుసన్నల్లోనే దాడులు: నక్కా ఆనందబాబు
ఏపీలో ప్రజల హక్కులను హరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. వైకాపా అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. డీజీపీ కనుసన్నల్లోనే తెదేపా కార్యాలయం, కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆనందబాబు హెచ్చరించారు.

రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపిన తెదేపా కార్యకర్తలు
అనంతపురం జిల్లా కేంద్రంలో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సప్తగిరి కూడలిలో రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. మరోవైపు అనంతపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రభాకర్‌చౌదరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

వెంకటాపురంలో పరిటాల సునీత గృహనిర్బంధం.. అనంతపురంలో కాలవ అరెస్ట్
అనంతపురం జిల్లాలో పలువురు తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత, హిందూపురంలో ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారధి, గుంతకల్లులో జితేంద్రగౌడ్‌లను ఇంటి వద్దే అడ్డుకున్నారు. అనంతపురం రవి పెట్రోల్ బంకు వద్ద మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు నిరసన తెలిపారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఒకటో పట్టణ స్టేషన్‌కు తరలించారు.
ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న తెదేపా బంద్.. వీడియో
తెలుగుదేశం కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైకాపా దాడిని నిరసిస్తూ ఆ పార్టీ ఇచ్చిన రాష్ట్రబంద్ ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. నిరసనకు దిగిన నేతలు, శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రగిరిలో పులివర్తి నాని అరెస్ట్
చిత్తూరు జిల్లా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పులివర్తి నాని సహా మరికొందరిని స్టేషన్‌కు తరలించారు. పులివర్తి నాని అరెస్ట్‌ను నిరసిస్తూ చంద్రగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణులు ధర్నా చేపట్టాయి.
పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి హౌస్ అరెస్ట్
చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, పుంగనూరులో తెదేపా నేత చల్లా రామచంద్రారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. తిరుపతిలో ఆ పార్టీ నేతలు సంజయ్, భాస్కర్ యాదవ్‌లను అరెస్ట్ చేశారు.
పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసం: యనమల
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే తెదేపా కార్యాలయాలపై విధ్వంసకాండ జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

పెద్దాపురంలో చినరాజప్ప ఆధ్వర్యంలో నిరసనలు
తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. పెద్దాపురంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు.
మద్దికెర బస్టాండ్ వద్ద బైఠాయించిన తెదేపా నేతలు
కర్నూలు జిల్లా మద్దికెరలో తెదేపా నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. బస్టాండ్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనందబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తెదేపా జెండాలు తగలబెడితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు- తెదేపా వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది.

పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. అన్ని జిల్లాల్లో ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పలుచోట్ల బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసిన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను కవిటి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌ను నిరసిస్తూ తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టాయి.

విశాఖలో అచ్చెన్నాయుడు గృహనిర్బంధం
విశాఖ జిల్లాలోనూ పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులను గృహనిర్బంధం చేశారు. చినవాల్తేరులోని ఇంటివద్ద అచ్చెన్నను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు 10 మంది తెదేపా నేతలను అరెస్ట్ చేశారు. తెదేపా కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ నిరసనలు కొనసాగాయి. పాడేరులో ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హౌస్ అరెస్ట్
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెదేపా నేత నరసింహ యాదవ్‌లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు తిరుమల వచ్చే యాత్రికులకు అసౌకర్యం కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నేలపై కూర్చొని నిరసన తెలిపిన ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన నేలపై కూర్చొని నిరసన తెలిపారు.

గొల్లపూడిలో దేవినేని ఉమ అరెస్ట్
కృష్ణా జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బస్టాండ్ వద్ద టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
ఇదీ చదవండి: