ETV Bharat / state

'జగన్​ ఆనందం కోసం నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది'

author img

By

Published : May 1, 2021, 1:13 PM IST

ఏపీ సీఎం జగన్​ ఆనందం కోసం తనని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. సీఐడీ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జే ట్యాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందన్నారు. రైతుల తరఫున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.

tdp-leader-devineni-uma-attend-for-cid-investigation
'జగన్​ ఆనందం కోసం నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది'

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి దేవినేని ఉమ సీఐడీ ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఆనందం కోసం తనని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి సీఐడీ ముందుకెళ్తున్నాన్న ఆయన.. రాత్రి 10 వరకు లోపల కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. రాష్ట్రంలో జే ట్యాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.

నాతో పాటు ధూళిపాళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 9 గంటలపాటు సీఐడీ కార్యాలయంలో కూర్చోబెడతారా..? ధాన్యం పెద్దఎత్తున దోపిడీ జరుగుతుంటే సీఎం స్పందించరు. మంత్రులు ధాన్యం దళారుల ముసుగు కప్పుకుంటే పట్టించుకోరు. ధాన్యం దోపిడీపై నాపై ఏ కేసు పెడతారో పెట్టుకోండి. రైతుల తరఫున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధం- దేవినేని ఉమ, తెదేపా నేత

ఏప్రిల్ 29న సీఐడీ.. దేవినేని ఉమను 9 గంటలపాటు విచారించింది.

ఇదీ చదవండి: మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో అధికారుల డిజిటల్ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.