ఆంధ్రప్రదేశ్లో న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. 'వైకాపా గూండాలు దళితుల అసైన్డ్ భూములు లాక్కుంటుంటే బాధిత దళిత కుటుంబాల వైపు నిలవడమే ఆయన చేసిన తప్పు. మాజీ ఎంపీ హర్షకుమార్, వైద్యులు సుధాకర్. అణనితారాణి, మహాసేన రాజేశ్లపై జరిగినట్లే... దళితులపై వేధింపులకు ఇది మరో నిదర్శనం. ఈ అన్యాయాలను దళిత సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ విద్య బలోపేతం.. వ్యవస్థల ప్రక్షాళన