Telangana Govt Governor Tamilisai Controversy : సోమవారం మంత్రి వర్గ సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసైను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాజాగా గవర్నర్ ఖండించారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలను వివరించారు. బిల్లులను తిప్పి పంపడం తన ఉద్దేశం కాదని పేర్కొన్న తమిళిసై.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని కాకవికలం చేసిన వరదలపై గవర్నర్ స్పందించారు. వర్షాల వల్ల ప్రజల పడిన ఇబ్బందులు తనకు ఎంతో బాధను కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాధేస్తోందన్నారు. తర్వలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. వరద ప్రభావంతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని.. రాగానే కేంద్రానికి పంపిస్తానని తమిళిసై స్పష్టం చేశారు.
వరద ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిందని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. వర్షాలపై కొన్ని పార్టీలు మెమోరాండం ఇచ్చాయని.. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు.
మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు వేగంగా జరగడం లేదని.. కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రాజ్భవన్లో సీఎల్పీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క నేతృత్వం లోని హస్తం నేతలు.. గవర్నర్తో సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు వల్లే వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని వారు కోరారు. గవర్నర్ కూడా వరదల్లో చిక్కుకున్న వారి గురించి తన సానుభూతి తెలిపారు. త్వరలో వారిని కలవనున్నట్లు కూడా ప్రకటించారు. గతంలో కూడా గవర్నర్ పలుమార్లు సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పర్యటనలు చేపట్టారు.
"బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పాను. బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తాను. ప్రభుత్వాన్ని నివేదిక అడిగాను.. రాగానే కేంద్రానికి పంపిస్తాను. వర్షాల వల్ల ప్రజల ఇబ్బందులు బాధ కలిగించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాధేస్తోంది. ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సింది. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలి. మారుమూల ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వర్షాలపై కొన్ని పార్టీలు మెమోరాండం ఇచ్చాయి. నీట మునిగిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలి."- తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ గవర్నర్
ఇవీ చదవండి: