రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని కాంగ్రెస్ నేతల విమర్శల్లో అర్థం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అభివృద్ధి జరగనిదే ప్రజలు తెరాసను మళ్లీ గెలిపించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు పార్టీ నడపడం చేతకావడం లేదని విమర్శించారు. ఉన్న పది మంది కాంగ్రెస్ నేతల్లో ఒకరంటే మరొకరికి పడదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 103 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన భాజపా కూడా విమర్శిస్తోందని ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా 120 నుంచి 130 సీట్లు, 22 నుంచి 23 ఎంపీ సీట్లు గెలవబోతోందని జోస్యం చెప్పారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్‌లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ