మాధక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెరాస ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్ణాటకలో భాజపా నేతలతో మాట్లాడుకుని కేసును నీరుగార్చుతున్నారని ఆరోపించారు. పరస్పర అవగాహనలో భాగంగానే నాగార్జునసాగర్‌లోనూ భాజపా బలహీనమైన అభ్యర్థిని పోటీలో దింపారని ఉత్తమ్ ఆరోపించారు. సాగర్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు.
శ్రీశైలం నుంచి 8 టీఎంసీల నీళ్లు ఏపీకి అక్రమంగా తరలించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదనే విషయాన్ని సాగర్ ప్రజలు గమనించాలని ఉత్తమ్ కోరారు. సాగర్‌లో పోడు భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. కాళేశ్వరంలో రెండు టీఎంసీల నీటి కోసం లక్ష కోట్లు ఖర్చుపెట్టారని.. అదనపు టీఎంసీ పేరుతో రూ.24 వేల కోట్లు వృథా చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.
ఇదీ చూడండి: రైతు అని చెప్పుకోవడానికి భయపడే రోజులుండేవి: మంత్రి జగదీశ్‌రెడ్డి