ETV Bharat / state

'జియో క్లౌడ్ సర్వీసులతో అంకురాల దశ తిరగనుంది'

ఇటీవల జియో ప్రకటించిన ఉచిత క్లౌడ్​ సర్వీసులు అంకురాలకు మంచి ఊతంగా మారనున్నట్లు టీ-హబ్ సీఈఓ రవి నారాయణన్ అభిప్రాయపడ్డారు. ఈ సర్వీసులతో అంకురాల మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు చక్కటి అవకాశాలు వస్తాయన్నారు.

'జియో క్లౌడ్ సర్వీసులతో అంకురాల దశ తిరగనుంది'
author img

By

Published : Aug 20, 2019, 2:37 PM IST

అంకురాల​ కోసం క్లౌడ్ సర్వీసుల ప్లాట్​ఫామ్​ను రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించింది. ఉచిత క్లౌడ్ సర్వీసులతో స్టార్టప్స్ మౌలిక స్వరూపాన్ని మార్చే సత్తా ఉందని హైదరాబాద్​లోని టీ-హబ్ సీఈఓ రవి నారాయణన్ అన్నారు. ఈ సర్వీసులు అంకురాలకు మంచి ఊతంగా ఉంటాయని తెలిపారు.

మైక్రోసాఫ్ట్​తో అంబానీ ఒప్పందం

క్లౌడ్ సర్వీసుల కోసం మైక్రోసాఫ్ట్​తో ఒప్పందం చేసుకున్నట్లు రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అంకురాల నిధుల్లో 80 శాతం ఈ సేవలకే పోతున్నట్లు ప్రసంగంలో ఆయన తెలిపారు.

జియో లానే ఇది హిట్టవుతుంది..

మనం దేశంలో ఉన్న అంకురాల్లో ఎక్కువ భాగం టెక్నాలజీ ఉపయోగించుకునేవే. జియో నెట్​వర్క్ ద్వారా ఉచిత క్లౌడ్​ సర్వీసులను అందిస్తే జియో లానే దీనిని ప్రజలు ఆదరిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యంత వేగంగా 15 మిలియన్‌ వినియోగదారులను పొందిన జియో... క్లౌడ్ సర్వీసులను అంకురాలకు అందించడం ద్వారా మరిన్ని వినియోగదారులను పొందే అవకాశముందన్నారు నారాయణన్.

ప్రస్తుతం ఏయే సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి..?

ప్రస్తుతం అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎంలు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలను కొంత కాలం పాటు రుణం రూపంలో అందుబాటులో ఉంచుతున్నాయి. ఆ తర్వాత ఆ సేవలను ఉపయోగించుకునేందుకు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

'జియో క్లౌడ్ సర్వీసులతో అంకురాల దశ తిరగనుంది'

ఇదీ చదవండిః మగాళ్లతో స్నేహం వద్దంటే తండ్రినే చంపేసింది..!

Intro:Body:TG_HYD_74_19_THUB_CEO_ON_JIO_CLOUD_SERVICES_7202041

అంకురాల కోసం క్లౌడ్‌ సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌ను ఇటీవల రిలయన్స్‌ జియో ప్రకటించింది. జియో ఉచిత క్లౌడ్‌ సర్వీసులకు సాంకేతికతకు సంబంధించి అంకురాల మౌలిక స్వరూపాన్ని మార్చగలిగే సత్తా ఉందని హైదరాబాద్‌లోని టీ-హబ్‌ సీఈఓ రవి నారాయణన్‌ అన్నారు. ఈ సర్వీసులు అంకురాలకు మంచి ఊతంగా ఉంటాయని వ్యాఖ్యానించారు.
భారతదేశం నుంచి వాళ్లు ఎప్పడూ చేస్తున్నట్లు గానే భారీ స్థాయిలో జియో మళ్లీ ఒక ప్రయత్నాన్ని ప్రారంభించారు. దేశం కోసం ఉపయోగపడే సాంకేతికత అభివృద్ధికి సంబంధించి అంకురాల మౌలిక స్వరూపం మారిపోతుంది. ఇలాంటి ప్రయత్నాల వల్లనే కొన్ని సమస్యలు పరిష్కారమౌతాయి. జియో ప్రకటన అంకురాలకు సంబంధించి మంచి ఊతంలా ఉంటుంది. - రవినారాయణన్‌ , టీ-హబ్‌ సీఈఓ
క్లౌడ్‌ సర్వీసుల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది జియో. రిలయన్స్‌ వార్షిక సమావేశంలో ఈ ప్రకటన చేశారు ముఖేష్‌ అంబానీ. అంకురాల నిధుల‌్లో 80 శాతం ఈ సేవలకే పోతున్నాయని ప్రసంగంలో భాగంగా ఆయన వ్యాఖ్యానించారు.
జియో లానే ఇది హిట్టవుతుంది...
భారతదేశంలో అంకురాలు ఎక్కువగా టెక్నాలజీ ఉపయోగించుకునేవే. జియో నెట్‌వర్క్‌ ద్వారా ఈ ఉచిత క్లౌడ్‌సర్వీసెస్‌ను అందించినట్లయితే జియోలానే దీనిని ఆధరిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత అంకురాలు సాంకేతిక ఆధారితమని మార్కెట్లోకి వచ్చిన జియో ఇప్పటికే నిరూపించింది. అత్యంతం వేగంగా కేవలం 10-15 నెలల్లో 15 మిలియన్‌ వినియోగదారులను పొందింది జియో. జియో నెటవర్క్‌ ద్వారా అంకురాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను అందించినట్లయితే అదే రీతిలో వినియోగదారులను పొందగలిగే సత్తా ఉంది క్లౌడ్‌ సర్వీస్‌కు.
ప్రస్తుతం ఇలా….
ప్రస్తుతం అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎంలు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలను కొంత కాలం పాటు రుణం రూపంలో అందుబాటులో ఉంచుతున్నాయి. ఆ తర్వాత ఆ సేవలను ఉపయోగించుకునేందుకు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

బైట్‌ : రవి నారాయణన్‌, సీఈఓ, టీ-హబ్‌.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.