ETV Bharat / state

నేడు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ బత్తాయిల దినోత్సవం - బత్తాయి రైతులకు సన్మానం

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ తెలంగాణ బత్తాయిల దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు.

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ బత్తాయి దినోత్సవం

author img

By

Published : May 9, 2020, 9:54 PM IST

Updated : May 10, 2020, 6:06 AM IST

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియం వేదికగా నేడు "తెలంగాణ బత్తాయి దినోత్సవం" జరగనుంది. రాజ్యసభ సభ్యుడు జోగిన్​పల్లి సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు ఉదయం 10 గంటలకు బషీర్‌బాగ్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో పలు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా 500 మంది క్రీడాకారులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ బత్తాయి డేను” పురస్కరించుకుని ప్రజలు పెద్ద ఎత్తున బత్తాయి పండ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పిలుపునిచ్చింది.

భవిష్యత్​లో కొరత...

కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో మార్కెటింగ్ లేకపోవడం వల్ల టన్ను బత్తాయి 7 వేల రూపాయలకు కూడా మద్ధతు ధర రావట్లేదని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం 500 నుంచి 800 టన్నుల బత్తాయి వితరణ చేయాలని నిర్ణయించారు. 2020 సంవత్సరంలో 20 కిలోలు ప్యాక్ 500 రూపాయల చొప్పున 2020 ప్యాకెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్ ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్న దృష్ట్యా... భవిష్యత్తులో ఆహారం, తాజా పండ్ల కొరత ఉత్పన్నం కాబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇక్కడే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా !

ఒక్క ఎల్‌బీ స్టేడియం వేదికగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా బత్తాయి రైతు వద్ద పండ్లు కొని పేదలకు పంపిణీ చేయాలని వాక్​ఫర్ వాటర్ సంస్థ వ్యవస్థాపకులు కరుణాకర్‌రెడ్డి కోరారు. మిటమిన్‌ సీ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరగుతుందన్నారు. ఈ నేపథ్యంలో రోజు వారి దిన చర్య సాఫీగా సాగుతుందని తెలిపారు. ఆర్థిక స్థోమత గల ప్రతి ఒక్కరూ ఆహారం బదులు వీలైనన్ని ఎక్కువ బత్తాయి వితరణ చేయాలని ఆయన సూచించారు. బత్తాయి రైతులకు సన్మానం సైతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : డీఎంహెచ్‌వోలతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్

Last Updated : May 10, 2020, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.