Telangana Wins Swachh Sarvekshan Grameen Awards : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో మరోమారు తెలంగాణలోని పలు జిల్లాలు సత్తా చాటాయి. జూన్ నెలకు నాలుగు కేటగిరీల్లోని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జిల్లాలను కేంద్ర జలశక్తి శాఖ అవార్డులు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో నాలుగు తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో అచీవర్స్, హై అచీవర్స్ విభాగాల్లో రెండు, మూడు విభాగాల్లో తెలంగాణలోని జిల్లాలు నిలిచాయి. అచీవర్స్ కేటగిరీలో రెండో స్థానంలో హనుమకొండ, మూడో స్థానంలో కుమురం భీం ఆసిఫాబాద్, హై అచీవర్స్ కేటగిరీలో రెండో స్థానంలో జనగాం, మూడో స్థానంలో కామారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఈ అవార్డులు రావడం పట్ల పట్టణ, పురపాలక శాఖ పారుశుద్ధ్య కార్మికులను అభినందించింది. సమష్ఠి కృషి వల్లే ఈ అవార్డు వరించిందని పురపాలక శాఖ కమిషనర్ తెలిపారు.
National Panchayat awards 2023 : 2023 సంవత్సరానికిగానూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి చేతులు మీదగా పంచాయతీ ప్రతినిధులు ఈ అవార్డులను అందుకున్నారు. కేంద్రం ప్రకటించిన 46 అవార్డుల్లో ఏకంగా 13 అవార్డులు తెలంగాణ పల్లెలకు వచ్చాయి.
జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ పల్లెలు : ఈ అవార్డులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్, జనగాం జిల్లా నెల్లుట్ల, మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్పల్లి, వికారాబాద్ జిల్లా చీమల్దర్రి, సూర్యపేట జిల్లా ఐపూర్,జోగులాంబ గద్వాల్ జిల్లా మాన్‌దొడ్డి పంచాయతీలు పంచాయతీ అవార్డులు అందుకున్నాయి. అలాగే మరికొన్ని గ్రామాలు ఈ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈ అవార్డులకు గానూ రూ.3 కోట్ల నగదుతో పాటు పురస్కారాను అందుకున్నారు.
జాతీయ నీటి అవార్డుల్లో సత్తా చాటిన తెలంగాణ : జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగో జాతీయ నీటి అవార్డుల్లో రాష్ట్రంలోని జగన్నాథపురం గ్రామ పంచాయతీ జాతీయ స్ధాయిలో ఉత్తమ పంచాయతీగా నిలిచింది. ఉత్తమ నీటి విధానాలను అవలంభించడంతో పాటు.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు ఈ గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా అవార్డు లభించింది. అదేవిధంగా ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ 3వ స్థానాన్ని సంపాదించింది. ఉత్తమ సంస్థల విభాగంలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయానికి 2వ స్థానం లభించింది. అలాగే అడవుల పెరుగదల, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వాహణ, మురుగు నీటి శుద్ధి వంటి అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
ఇవీ చదవండి :