దేశంలో రెండోదశ కొవిడ్ విజృంభణతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కష్టంలో ఉన్న దేశానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు. కొవిడ్ కట్టడికి శక్తి వంచనలేకుండా పాటుపడుతున్న వారియర్స్‌కు సుమారు 26వేల కిట్లు పంపిణీ చేసి తన ఉదారభావాన్ని చాటుకున్నారు ఎస్వీఆర్ ఫార్మా వ్యవస్థాపకుడు ఎస్వీఆర్.
కొవిడ్ పట్ల అవగాహన లేకపోవడం వల్లనే ఎక్కువ మంది మహమ్మారి బారిన పడుతున్నారని.. అందువల్ల తన బృందాలతో కలిసి ఇరు తెలుగు రాష్ట్రాల్లోను మారుమూల పల్లెల్లో తిరిగి కొవిడ్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈనెల 14 నుంచి ఎస్వీఆర్ ఆరోగ్య రక్షణ కిట్ల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తునట్లు తెలిపారు. కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 8వేల కుటుంబాలకు ఎస్వీఆర్ కిట్లు అందించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్, జరిమానా