ETV Bharat / state

కార్మికుల ఆత్మహత్యలన్నీ... ప్రభుత్వ హత్యలే: సురవరం - cpi

ముఖ్యమంత్రి కేసీఆర్​పై సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్​రెడ్డి ధ్వజమెత్తారు. కార్మికులకు తెలిసిరావాలనే వేచి చూశామని కేసీఆర్​ మాట్లాడడం అన్యాయమన్నారు. కార్మికుల ఆత్మహత్యలన్నీ... ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.

suravaram sudhakar reddy  spoke on cm kcr decision about rtc employees
కార్మికుల ఆత్మహత్యలన్నీ... ప్రభుత్వ హత్యలే: సురవరం
author img

By

Published : Nov 29, 2019, 11:25 PM IST

ఆర్టీసీ కార్మికులకు తెలిసిరావాలనే ఇన్ని రోజులు వేచి చూశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడటం అన్యాయమని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని దుయ్యబట్టారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామన్నందుకు కేసీఆర్‌ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందని భాజపా నేతలు చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే కేసీఆర్‌ దిగివచ్చాడని లక్ష్మణ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. భాజపా రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తోందని... దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

కార్మికుల ఆత్మహత్యలన్నీ... ప్రభుత్వ హత్యలే: సురవరం

ఇవీ చూడండి: కార్మిక సంఘాల నేతలకు షాకిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.