SC REJECT COMPLETE STAY ON HIGHCOURT ORDERS ON AMARAVATI : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాల పరిమితికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. నెల రోజుల్లో కొన్ని పనులు, ఆరు నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న పరిమితులపై స్టే ఇచ్చింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జనవరి 31లోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 31న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఇవీ చదవండి: