ETV Bharat / state

ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక కొట్టివేయండి: తెలంగాణ - తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన తాజా వార్తలు

జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికపై సుప్రీంకోర్టులో తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్‌లు, ఏపీ ఉద్యోగులు వేసిన పిటిషన్​ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

suprem court hearing on electricity employees in between telangana and andrapradhesh
'ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను కొట్టివేయాలి'
author img

By

Published : Nov 17, 2020, 6:53 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికపై సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ జెన్​కో, ట్రాన్స్ కో, డిస్కమ్‌లు, ఏపీ ఉద్యోగులు వేసిన పిటిషన్​ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫున ముకుల్ రోహత్గీ, వి.గిరి, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. విభజన వివాదంలో లేని 584 మందిని రాష్ట్రానికి కేటాయించడంపై తెలంగాణ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మాధికారి కమిటీ పరిధి దాటి కేటాయింపులు జరిపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివాదంలో లేని ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం సరికాదని వాదనలు వినిపించారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అదనంగా 584 మందిని ముగింపు నివేదికలో కేటాయించారని తెలిపారు. ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను కొట్టివేయాలని కోరారు. ప్రతి నివేదికలో తెలంగాణపై భారం పడేలా కేటాయింపులు ఉన్నాయన్న న్యాయవాదులు.. సప్లిమెంటరీ నివేదికలో 300 మందిని అదనంగా కేటాయించినా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. సప్లిమెంటరీ నివేదిక వరకు కేటాయింపులపై తమకు అభ్యంతరం లేదన్నారు. తదుపరి విచారణను సుప్రీం రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదంవడి: ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తాం: పద్మనాభరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.