సాధాారణం కంటే ఎక్కువ...
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నిర్మల్ జిల్లా పెంబి, సంగారెడ్డి జిల్లా ఆల్మాయ్పేట్, వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో 39.8, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌లో 39.7, నిజామాబాద్ జిల్లా బెల్లాల్లో 39.6, నిర్మల్ జిల్లా వడ్యాల్లో 39.6, రామగుండంలో 39.5, రాజోలిలో 39.5, సంగారెడ్డి జిల్లా అనంతసాగర్‌లో 39.5 డిగ్రీ సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాగల మూడు రోజులూ...
రాష్ట్రంలో రాగల మూడురోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి:'సోషల్ వేధింపుల'పై రాజకీయ కాక