అల్వాల్ పీఎస్ పరిధిలోని మంజీరా కాలనీలో నివాసం ఉంటున్న నాగరాజ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను అమెజాన్లో సేల్స్బాయ్గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. అతడు చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమ కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చూడండి: ఆస్తి కోసం అంత్యక్రియల నిలిపివేత...!