సూర్యాపేట జిల్లాకు చెందిన సుధాగాని జ్ఞాని అనే యువకుడు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జాతీయ జెండా పట్టుకుని పరుగు నిర్వహించాడు. అతడిని ప్రోత్సాహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి సైతం పరుగెత్తారు.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు జెండా పట్టుకుని సుధాగాని జ్ఞాని పరుగు పేట్టాడు. అతనికి మద్దతుగా అసెంబ్లీ కూడలి నుంచి పోలీసు కమిషనరేట్ కార్యాలయం వరకు వెంకటేశ్వర్ రెడ్డి పరుగెత్తి జాతీయ భావాన్ని పెంపొందించారు.
ఇదీ చూడండి: అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు